Samantha : రాత్రంతా అదే పని.. ఉదయమంతా ఇలా.. సమంత పోస్ట్ వైరల్

Samantha Ruth Prabhu Night Shoots సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా సమంత కేరళకు బయల్దేరింది. ఖుషి సినిమా కోసం కేరళకు వెళ్తున్నట్టుగా సమంత తెలిపింది. అసలు ఫస్ట్ సింగిల్ ప్రోమోతోనే అంచనాలు పెంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2023, 12:03 PM IST
  • బిజీగా ఉంటోన్న సమంత
  • కేరళలో ఖుషి షూటింగ్
  • ఫ్లైట్‌లో బయల్దేరిన సమంత
Samantha : రాత్రంతా అదే పని.. ఉదయమంతా ఇలా.. సమంత పోస్ట్ వైరల్

Samantha Off to Kerala For Kushi సమంత తాజాగా కేరళకు పయనమైంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియన్ నుంచి కేరళకు వెళ్తున్నట్టుగా సమంత చెప్పింది. రాత్రి అంతా కూడా షూటింగ్‌లు అని, పగలు ఇలా పార్టీలు  చేసుకుంటూ ఉండటమే జరుగుతోందని చెప్పుకొచ్చింది. గ్వాలియన్ నుంచి కేరళకు వెళ్తున్నామని, ఖుషీ షూటింగ్ ఉందని సమంత తెలిపింది. ఇక సమంతతో ఆమె టీం కూడా కనిపిస్తోంది.

సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. నాగ చైతన్య చేసిన కామెంట్లతో సమంత ఎక్కువగా వైరల్ అయింది. సమంత చాలా మంచి వ్యక్తి అని అన్నాడు. తామిద్దరికి పరస్పర గౌరవం ఉందని, అయితే సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోందని, ఇక మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఆమెను కూడా అగౌరవ పరుస్తున్నారంటూ నాగ చైతన్య అన్న మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సమంత మంచిదని చెబుతూనే.. శోభితతో వస్తోన్న రూమర్లన్నీ కూడా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య. చై చెప్పిన ఈ మాటల తరువాత సమంత ఓ పోస్ట్ వేసింది. మనుషులంతా ఒక్కటే కానీ వారికుండే భయాలు, ఈగోలు మాత్రం వేరు అంటూ చెప్పుకొచ్చింది. ఈగోలు, భయాల వల్లే విడిపోయినట్టుగా చెప్పకనే చెప్పినట్టుంది సమంత. అలా సమంత గత వారం అంతా కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే వచ్చింది.

Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

సమంత ఇప్పుడు సిటాడెల్, ఖుషి సినిమాలను మాత్రమే లైన్‌లో పెట్టింది. ఇక కొత్త సినిమా ప్రకటన అయిఆతే ఏమీ ఇవ్వలేదు. శాకుంతలంతో సమంతకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ సినిమా భారీ ఎత్తున నష్టాలను తెచ్చి పెట్టింది. కనీసం డబుల్ డిజిట్స్‌ కూడా రాబట్టలేకపోయింది. శాకుంతలం సినిమాతో సమంత పరువు పాన్ ఇండియా వైడ్‌గా పోయినట్టు అయింది. ఎక్కడా కూడా సమంత శాకుంతలం సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదని తెలిసిందే.

Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News