రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన సమంత ?

సమంత జక్కన్న సినిమాకు నో చెప్పిందా ?

Last Updated : Jul 21, 2018, 10:08 PM IST
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన సమంత ?

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి యస్ చెబుతుంది అనే అనుకుంటాం కదా! కానీ టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సమంత మాత్రం జక్కన్న సినిమాకు నో చెప్పిందట. అవును తాజాగా వినిపిస్తోన్న టాలీవుడ్ టాక్ ప్రకారం రాజమౌళి సినిమాను సమంత తిరస్కరించినట్టు తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిందిగా సమంతను ఆశ్రయించినట్టుగా ఓ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే, సమంత ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తాజాగా టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న కారణాలు ఏంటనే వివరాలపై ఇంకా స్పష్టత లేదు. అన్నింటికిమించి దీనిపై ఇంకా ఇరువర్గాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడకపోవడం గమనార్హం. 

గతంలో రాజమౌళికి జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన ఈగ సినిమాలో నాని సరసన జంటగా నటించిన సమంతకు జక్కన్నతో ఎటువంటి విభేదాలు కూడా లేవు. మరి నిజంగానే ఆమె ఈ సినిమాను తిరస్కరించిందా లేదా ఒకవేళ తిరస్కరించినట్టయితే, ఎందుకు తిరస్కరించింది ? ఏ కారణంతో నో చెప్పిందనే వివరాలు తెలియాల్సి వుంది.

Trending News