Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌

Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 23, 2024, 06:43 PM IST
Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌

Hyderabad Rains: ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. నిరాటంకంగా గంటన్నర పాటు వర్షం కురవడంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ యంత్రాంగం కలిసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో పెద్దగా ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తలేదు.

Also Read: Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త

 

నగరవ్యాప్తంగా..
హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఆఫ్జల్‌గంజ్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో దంచి కొట్టింది. చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌, సైదాబాద్, మాదన్నపేట్‌, సరూర్‌నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసింది. ఇక దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో కూడా వాన పడింది.

Also Read: KarimNagar: అచ్చం మోదీలా బండి సంజయ్.. తొలిసారిగా కేంద్ర మంత్రి ఏం చేశారో చూశారా?

 

మలక్‌పేటలో ట్రాఫిక్‌ జామ్‌
హైదరాబాద్‌లోని మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద చేరింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతం ఉన్న బ్రిడ్జి కింద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు దారి మళ్లిస్తున్నారు. వరద నీరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ వైపు వాహనాలు నిలిచిపోయాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

Trending News