UP Cop Demote: మహిళ పోలీసుతో లాడ్జీలో యవ్వారం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్.. ఎక్కడో తెలుసా..?

Dsp To Constable Demote: పోలీసు ఉన్నతాధికారి, మహిళ లేడీ కానిస్టేబుల్ తో కాన్పూర్ లోని లాడ్జీలో అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో యూపీలో జరిగిన ఘటన  ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

Written by - Inamdar Paresh | Last Updated : Jun 23, 2024, 01:04 PM IST
  • మహిళతో డీఎస్పీ ఎఫైర్..
  • సీరియస్ గా తీసుకున్న పోలీసుశాఖ..
UP Cop Demote: మహిళ పోలీసుతో లాడ్జీలో యవ్వారం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్.. ఎక్కడో తెలుసా..?

Dsp To Constable Demote in uttar pradesh: కొందరు పోలీసులు తమ శాఖకు చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు.. తమకు అన్యాయం జరిగితే.. వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తారు. కానీ కొందరు ఖాకీచకులు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారిపైన కన్నేస్తున్నారు. ఇటీవల కొందరు పోలీసులు,  ఫిర్యాదు చేయడం కోసం వచ్చిన మహిళలను వేధింపులు గురిచేస్తున్నారు. తమ సహ మహిళ ఉద్యోగినులను సైతం బెదిరించి అత్యాచారాలు చేస్తున్నారు. మరికొందరు అక్రమ సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొందరు ఇలాంటి పనులు చేయడం వల్ల డిపార్ట్ మెంట్ అంతా చెడ్డపేరు వస్తుంది. తాజాగా, ఒక ఉన్నతాధికారిచేసిన పాడుపని.. ఉత్తర ప్రదేశ్ పోలీసుశాఖలో తీవ్ర కలకలంగా మారింది. దీనిపై పోలీసు శాఖ మాత్రం సదరు అధికారిపై కఠినచర్యలు తీసుకుంది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లో.. ఉన్నావ్ బిఘాపూర్ సర్కిర్ ఆఫీసర్‌గా (డీఎస్పీగా) కృష శంకర్ ఉండేవారు. అప్పుడు ఇంట్లో భార్యభర్తల మధ్యగొడవ జరిగింది. వెంటనే సదరు అధికారి కృష శంకర్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. సెలవు కావాలని అధికారికి చెప్పేసి.. ఆఫీసు, హోమ్ రెండు మొబైల్స్ స్విచాఫ్ పెట్టేశారు. ఈ నేపథ్యంలో.. భర్తకు ఏం జరిగిందోనని భయపడి అతని భార్య ఎస్పీని ఆశ్రయించింది. శంకర్ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి.

చివరి లోకేషన్ ఆధారంగా కాన్పూర్‌లో ఓలాడ్జీలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి, పోలీసులు, అధికారి భార్య డోర్ తీశారు. ఆయన మరో యువతితో అడ్డంగా దొరికిపాయారు. ఆమె కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వెంటనే దీనిపై డీఎస్పీ కృష శంకర్ భార్య.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

ఒక ఉన్నతాధికారిగా ఉండి, పోలీసు శాఖను పరువునుబజారును పడేసినందుకు, డిపార్ట్ మెంట్ తీవ్రంగా పరిగణించింది. వెంటనే సదరు కృష శంకర్ ను డీఎస్పీ నుంచి తిరిగి కానిస్టేబుల్ గా డిమోట్ చేస్తు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నిందితుడిని గోరఖ్ పూర్ బెటాలియన్లోని ప్రావిన్షియల్ ఆర్మ్ డ్ కానిస్టేబులరీ లో కానిస్టేబుల్ గా డిమోట్ చేసింది. ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News