Ashada Masam 2024: ఆషాడమాసంలో జాక్పాట్ కొట్టబోయే రాశుల వారి వీరే.. వీరికి డబ్బే డబ్బు..

Ashada Masam 2024: ఆషాడ మాసంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 23, 2024, 02:51 PM IST
Ashada Masam 2024: ఆషాడమాసంలో జాక్పాట్ కొట్టబోయే రాశుల వారి వీరే.. వీరికి డబ్బే డబ్బు..

Ashada Masam 2024: హిందూ మాసంలోని నాలుగవ నెలలో ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. ఈనెల ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఆషాడ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో దేవశయని ఏకాదశి నుంచి శ్రీ మహా విష్ణువు దాదాపు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. అలాగే ఈ ఆషాడ మాసంలో గుప్త నవరాత్రితో పాటు గురు పౌర్ణమి వంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగలు కూడా వస్తాయి. అలాగే ఈ ఆషాడ మాసం పూర్వాషాడ ఉత్తరాషాడ నక్షత్రం చేత ప్రభావితమవుతుంది. కాబట్టి కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఆషాడ మాసంలో మేషరాశితో పాటు మకర ఇతర రాశుల వారికి శ్రీమహావిష్ణువుని అనుగ్రహం కలిగి విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే జీవితంలో ఆనందం శ్రేయస్సును కూడా సులభంగా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వృషభ రాశి: 
వృషభ రాశి వారికి ఆషాడమాసంలో అనేక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వృత్తిపరమైన పురోగతి లభించడమే కాకుండా ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబ జీవితంలో అనేక మార్పులు వచ్చి ఆనందం నెలకొంటుంది. దీంతోపాటు స్నేహితులతో కలిసి వీరు ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంది.

కన్యారాశి: 
కన్యా రాశి వారికి కూడా ఆషాడమాసంలో అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో భూమి లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఎప్పటినుంచో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరబోతోంది. అలాగే ఉద్యోగాలు చేసే వారికి జీతాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు కొత్త కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే శ్రీమహావిష్ణువుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎప్పటినుంచో వస్తున్న వివాదాలు ఈ సమయంలో ముగుస్తాయి.

తులారాశి: 
తులా రాశి వారికి కూడా ఆషాడ మాసంలో అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కాస్త విముక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఎలాంటి పనులైన మంచిగా చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు. దీంతో పాటు శ్రీమహావిష్ణువుని అనుగ్రహంతో ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే ఎప్పటినుంచో వస్తున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ భాగస్వామితో కలిసి ఏదైనా ఆస్తులు కూడా కొనగలుగుతారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:
మకర రాశి వారికి ఆషాడమాసంలో చిక్కుకుపోయిన డబ్బు తిరిగివస్తుంది. అంతేకాకుండా ఉద్యోగంలో పురోగతి లభించి మంచి పేరు పొందుతారు. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే భాగస్వామి మధ్య అవగాహన పెరిగి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా వీరికి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని కారణంగా శక్తివంతంగా తయారవుతారు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరు కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రలకు కూడా వెళ్లగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News