Meenakshi Chaudhary: రెడ్ డ్రెస్సులో మీనాక్షి చౌదరి.. యువతను ఫిదా చేసేలా!

Meenakshi Chaudhary bold and hot  Instagram pics: గుంటూరు కారం సినిమాతో ఈ మధ్యనే తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం వరసగా తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలతోనే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం మీనాక్షి షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి..

1 /5

సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చుత వాహనముల నిలపరాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే మొదటి సినిమా వల్ల ఈ హీరోయిన్ కి ఎటువంటి లాభం కలగలేదు. ఈ సినిమా వల్ల మీనాక్షికి ఎటువంటి గుర్తింపు రాలేదు. 

2 /5

కానీ ఆ సినిమా వల్ల.. రవితేజ సినిమాలో ఛాన్స్ మాత్రం అందుకోగలిగింది. రవితేజ సినిమా ఖిలాడీలో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్. ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. కానీ మీనాక్షికి వరసగా ఆఫర్లు మాత్రం తెచ్చి పెట్టింది.

3 /5

ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేష్ బాబు హీరోగా వచ్చిన.. గుంటూరు కారం సినిమాలో కనిపించింది ఈ హీరోయిన్. అయితే ఈ చిత్రం మీనాక్షికి చేదు అనుభవం మిగిల్చింది.  ఈ సినిమాలో మీనాక్షికి కేవలం రెండో హీరోయిన్ పాత్ర లభించడంతో.. ఆమె అభిమానులు సైతం నిరాశకు గురయ్యారు. 

4 /5

కాగా మీనాక్షి అవకాశాల పైన మాత్రం.. ఈ చిత్రం ఎటువంటి ప్రభావం చూపివ్వలేదు. ప్రస్తుతం..తెలుగు తమిళంలో వరస అవకాశాలతో దూసుకుపోతోంది ఈ హీరోయిన్. తమిళంలో త్వరలోనే విజయ్ గోట్ చిత్రంలో కూడా కనిపించనుంది. 

5 /5

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. రెడ్ డ్రెస్సులో.. ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఫిధా చేస్తున్నాయి.