RRR New Update: కెమెరాలు లేనపుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏం చేస్తున్నారో మీరే చూడండి

RRR Latest Updates: ఆర్ఆర్ఆర్ షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ దొరికినట్లుంది.. వెంటనే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏం చేస్తున్నారో చూడండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 04:23 PM IST
  • ఎన్టీఆర్, చెర్రీ ఫోటో ట్వీట్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్
  • షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరు ఏం చేస్తున్నారో చూడండి
  • ఈ నెల 25న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్
RRR New Update: కెమెరాలు లేనపుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏం చేస్తున్నారో మీరే చూడండి

RRR Latest Updates: వర్క్ మధ్యలో కాస్త గ్యాప్ దొరికినా.. లేక ఏమీ తోచకపోయినా.. వెంటనే సెల్‌ఫోన్‌లో తలదూర్చడం కామన్. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడమో, వైరల్ వీడియోలు చూడటమో, నచ్చిన మ్యూజిక్ వినడమో.. ఇలా టైమ్‌ పాస్ చేసేస్తుంటారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోనే ఇందుకు నిదర్శనం.

ఆ ఫోటోలో హీరోలు ఎన్టీఆర్,  రామ్ చరణ్ చెరో దిక్కు అలా నడుం వాల్చి సెల్‌ఫోన్‌లో మునిగిపోయారు. కెమెరా రోలింగ్‌లో లేనప్పుడు ఇలా సెల్‌ఫోన్ స్క్రోలింగ్‌లో మునిగిపోయారంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ షేర్ చేసిన ఈ ఫోటోపై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కింద కార్పెట్ లాంటిది ఏమీ వేసుకోకుండానే చెర్రీ అలా నడుం వాల్చాడని.. ఆయన సింప్లిసిటీ సూపర్బ్ అని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేయడం గమనార్హం. 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ ఏడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అందుకు తగినట్లుగా ఆ చిత్ర టీమ్ ప్రమోషన్స్ కూడా చేపట్టింది. కానీ ఇంతలోనే కోవిడ్ థర్డ్ వేవ్ రావడంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో మార్చి 25న రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్, పాటలు, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: Viral Video: కోపిష్టి జంట... ఇంత కోపమైతే ఇక కాపురమెలా చేస్తారో.. వీడియో వైరల్..

 

Also Read: Ongole Fire Accident: ఒంగోలులో అగ్ని ప్రమాదం.. ఏడు ట్రావెల్ బస్సులు దగ్ధం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News