Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Vijay Devarakonda: మొన్నటి వరకు రష్మిక మందన.. విజయ దేవరకొండ ప్రేమ వ్యవహారం సినీ అభిమానులకు తెలిసిన కానీ అధికారికంగా వారిద్దరూ బయట పెట్టకుండా దాచి పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక మాట్లాడుతున్న మాటలు చూస్తే వీరిద్దరి ప్రేమ చెప్పకనే ఈ భామ చెప్పేస్తోంది అనే విషయం మనకి అనిపించక మానదు  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2023, 10:11 AM IST
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Vijay-Rashmika: తెలుగు ఇండస్ట్రీలో.. గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమికులని ఫిక్స్ అయిపోయి కూడా బయట పెట్టని జంట ఎవరన్నా ఉన్నారు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక మందన.. విజయ దేవరకొండ. వీరిద్దరూ ఏమి చేసినా వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఈ జంట ఈ విషయాన్ని అధికారికంగా అయితే బయట పెట్టకుండా దోబూచులాటలాడుతున్నారు.

కాగా ప్రస్తుతం రష్మిక మందన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమా చేసింది డిసెంబర్ ఒకతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ ఉండి ఈ హీరోయిన్. ఈ నేపథ్యంలో కొన్ని బుల్లితెర షోలకి కూడా అటెండ్ అవుతోంది. ఈ బుల్లితెర షోలే రష్మిక ప్రేమ వ్యవహారాన్ని మరింత బయట పెడుతున్నాయి. మొన్ననే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి అటెండ్ అయిన రష్మిక.. విజయ్ దేవరకొండ గురించి వినగానే కొంచెం సిగ్గుపడడంతో.. అలానే రష్మిక పక్కన ఉన్నవారు చేసిన కామెంట్స్ తో వీరిద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నారు అని వార్త వైరల్ అవుతూ వస్తోంది. ఇంక ఇది చాలదన్నట్టు ఇప్పుడు రష్మిక ఏకంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని హిందీ షోలో చెప్పేసింది.

తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ గురించి చెప్పిన మాటలు వింటే ఇక ఆ ఇంటికి రష్మిక అనే కోడలిగా కన్ఫామ్ అయినట్టుగానే కనిపిస్తోంది. యానిమల్ ప్రమోషన్స్ కోసం రష్మిక ఓ హిందీ సింగింగ్ షోకు వెళ్లింది. అక్కడ ఓ దివ్యాంగురాలైన గాయనిని రష్మిక మెచ్చుకుంది. ఆ గాయని అంటే తాను రెండో తల్లిగా భావించే మాధవి దేవరకొండకి సైతం చాలా ఇష్టమని విజయ దేవరకొండ అమ్మ గురించి చెప్పుకొచ్చింది.

‘మా ఇంటి నుంచి ఈ విషెస్ వచ్చాయి.. మాధవి ఆంటీ.. నాకు సెకండ్ మదర్ లాంటి వారు.. ఆమెకు కూడా నువ్వంటే చాలా ఇష్టం’ అని ఆ గాయనికి చెప్పింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. విజయ్ తల్లి.. తనకు కూడా తల్లి లాంటిదే అని చెప్పడంతో దేవరకొండ ఇంటికి కోడలిగా ఫిక్స్ అయినట్టుందే? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు తాను మా ఇంటి నుంచి అనడంతో ఇంక అసలు ఆలోచించే ప్రసక్తే లేదని.. రష్మిక తమ రౌడీ హీరో పిల్ల అని విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News