Rashmika Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్

Vijay Devarakonda : విజయ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్షిప్ పైన మన నెటిజన్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే వారిద్దరూ ఏ ఫోటోలు షేర్ చేసిన వాటిని ఢీకొడ్ చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్నా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుందా? నిజమే అంటున్నారు మన సోషల్ మీడియా యూజర్స్. మరి వాళ్ళు ఈ విషయాన్ని ఎలా కనుక్కున్నారో ఒకసారి చూద్దాం

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2023, 12:19 PM IST
Rashmika Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్

 Rashmika Mandanna Diwali Celebrations: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. మరోపక్క రౌడీ హీరో విజయ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా వీరిద్దరి సినిమాల కన్నా కూడా ఇప్పుడు వీరిద్దరి దీపావళి ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నాయి.

రష్మిక మందాన, విజయ్ దేవరకొండ కలిసి దీపావళి జరుపుకున్నారా? రష్మిక మందాన నేరుగా విజయ్ ఇంటికే వెళ్లి అతని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుందా? అవును అంటున్నారు మన నేటిజన్స్. అయితే ఇదంతా వారెలా కనుక్కున్నారు అంటే వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలు ద్వారానే.

ఆదివారం ఈ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ లో తమ తమ దీపావళి సెలబ్రేషన్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ అభిమానులకు విషెస్ తెలియజేశారు.
మొదట రష్మిక మందన్నా తన ఫోటో షేర్ చేస్తూ ఇన్‌స్టాలో దీపావళి విషెస్ చెప్పింది. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఓ బెంచ్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేసింది ఈ హీరోయిన్. అలానే ఆ ఫోటో కింద క్యాప్షన్ గా హ్యాపీ దివాలీ మై లవ్స్ అని పెట్టింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాసేపటికి మన హీరో విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోస్ లో విజయ దేవరకొండ, ఆయన అమ్మానాన్న ..అలానే ఆనంద్ దేవరకొండ కనిపించారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ అతడు కూడా హ్యాపీ దివాలీ మై లవ్స్ అనే క్యాప్షన్ పెట్టడం విశేషం.

ఇక అక్కడ మొదలైంది అభిమానులకు అనుమానం. ఒకే క్యాప్షన్ పెట్టారని చెప్పి ఈ ఇద్దరు జంటల ఫోటోలను పక్క పక్కన పెట్టి చూడడం మొదలు పెట్టారు. వెనక లైట్స్ అలానే వెనక గోడలను చూసి.. రష్మిక ఫొటోపై స్పందిస్తూ.. నువ్వు విజయ్ ఇంట్లోనే ఉన్నావ్ కదా అనే కామెంట్స్ చేశారు. అంతేకాదు ఇద్దరి వెనక ఉన్న గోడలు ఒకటే అని.. ఇద్దరు విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉన్నారు అని కింద రకరకాలుగా కామెంట్లు పెట్టేశారు. 

మరో పక్క ఇద్దరు ఒకే క్యాప్షన్ రష్మిక పోస్ట్ కింద మై లవ్స్ అంటే విజయ్ అన్నే కదా అని.. విజయ్ పోస్ట్ కింద మై లవ్స్ అంటే రష్మిక కదా అని ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం. 

మొత్తానికి నెతిజెన్స్ అందరూ వీరిద్దరి ఫోటోలు కలిపి షేర్ చేస్తూ సేమ్ ప్లేస్, సేమ్ బ్యాక్‌గ్రౌండ్, సేమ్ క్యాప్షన్.. వీరిద్దరూ తమ దీపావళి సెలబ్రేషన్స్ ద్వారా అఫీషియల్ గా రిలేషన్షిప్ కన్ఫామ్ చేసేసారు అంటూ వాళ్లకి వాళ్లే ఫిక్స్ అయిపోతున్నారు.

కాగా ఇది మొదటిసారి కాదు ఇలా ఎన్నోసార్లు రష్మిక ఇంస్టాగ్రామ్ ఫోటోలను పరిశీలించి ఆమె విజయ్ దేవరకొండ తోనే ఉంది అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఈ ఇద్దరూ కలిసి గీతగోవిందం సినిమాలో నటించినప్పటి నుంచే రష్మిక, విజయ్ మధ్య ఏదో నడుస్తోందన్న పుకార్లు మొదలయ్యాయి. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో కనిపించారు వీరిద్దరూ.

Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 

Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

  

Trending News