Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..

Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 17, 2024, 08:24 PM IST
Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..

Rashmika Mandanna-Vijay Devarkonda : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా మారుమ్రోగి పోతోంది. ఈ మధ్యనే సందీప్ రెడ్డి వంగ ధర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాగా రష్మిక కి కూడా బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు  వస్తున్నాయి.

చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న రష్మిక మందన్న సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాజాగా రష్మిక మందన్న తాను ఒక బుక్ చదువుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ బుక్ తనకు ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ బుక్ పేరే ది స్పానిష్ లవ్ డిసెప్షన్. 2021 లో విడుదలైన బెస్ట్ నవలల్లో ఇది కూడా ఒకటి. 

ప్రేమకు సంబంధించిన నవలలు, అందులోనూ ప్రేమలో ఉండే మోసాలకి సంబంధించిన నవలలు చదవాల్సిన అవసరం ఏం వచ్చిందని నిజంగానే ఆమె ఎవరినైనా ప్రేమించి మోసపోయిందా అని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 

ఇక సినిమాల పరంగా చూస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్పది రూల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమాతో పాటు రెయిన్బో అనే ఒక తెలుగు, తమిళ్ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. హిందీలో కూడా ఈమె చావా అనే ఒక పీరియడ్ డ్రామాలో కనిపించబోతోంది.

Read More:Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?

Read More: Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitterమాధవీలతకు క్లాస్ పీకిన బీజేపీ అధి నాయకత్వం.. ప్రజల్లోకి వెళ్తేనే ఆదరణ ఉంటుందంటూ బ్రైన్ వాష్‌.

Trending News