Unstoppable with NBK: రష్మికకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. వాట్స్ అప్ అంటూ సిగ్గులు

Rashmika Mandanna: గీతా గోవిందం సినిమాతో మొదటిసారి జంటగా కనిపించారు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఆ తరువాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా కలిసి నటించారు. అయితే ఆ సినిమా దగ్గరి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అనే రూమర్ ఇప్పటివరకు కూడా వినిపిస్తూనే ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 03:37 PM IST
Unstoppable with NBK: రష్మికకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. వాట్స్ అప్ అంటూ సిగ్గులు

Rashmika Mandanna : తెలుగు ప్రేక్షకులకు రష్మిక మందాన విజయ్ దేవరకొండ మధ్య ఏమి జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి అని ఎంతో ఆసక్తి అననడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు ముఖ్య కారణం వీరు ప్రేమించుకున్నట్లు వారి ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా తెలియజేసిన.. డైరెక్ట్ గా మాత్రం ఆ విషయం బయట పెట్టకపోవడం. వీరిద్దరూ చేసిన మొదటి సినిమా గీతాగోవిందం దగ్గర నుంచి వీరి మధ్య ప్రేమ ఉంది అని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వీరిద్దరు చేసిన డియర్ కామ్రేడ్ చిత్రం డిజాస్టర్ గా మిగిలిన కానీ.. వీరి మధ్య రిలేషన్షిప్ రూమర్స్ మాత్రం మరింత పెరిగాయి.

కాగా రష్మిక గురించి విజయ్.. అలానే విజయ్ గురించి రష్మిక ఏమన్నా మాట్లాడుతారేమో అని ప్రేక్షకులు వారి ప్రతి ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అండ్ స్టాపబుల్ షోలో రష్మిక విజయ్ దేవరకొండ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం 'యానిమల్'. డిసెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం బాలకృష్ణ సెన్సేషనల్ అన్‌స్టాపబుల్ షోకి అతిథులుగా వచ్చారు. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం విడుదలయ్యి సోషల్ మీడియా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ ప్రోమోలో బాలయ్య, రణబీర్, రష్మిక, సందీప్ కలిసి సందడి చేశారు. కాగా ఈ ప్రోమోలో బాలకృష్ణ రష్మికని విజయ్ తో ఫోన్ కాల్ లో మాట్లాడించారు. ఫోన్లో విజయ్ వాట్సాప్ అనగానే రష్మిక సిగ్గుపడుతుంది. వెంటనే వెనక డియర్ కామ్రేడ్ లవ్ సాంగ్ కూడా వేశారు. ఇక విజయ్ దేవరకొండ కాల్ లో ఉండగానే బాలకృష్ణ సందీప్ రెడ్డి తో.. మీ హీరోకి చెప్పమ్మా ఐ లవ్ రష్మిక అని.. అని తమాషాగా అన్నారు. వెంటనే రణబీర్ కపూర్.. మీ ఫస్ట్ సినిమా హీరోకి ..సెకండ్ సినిమా హీరోకి కాదు అని అన్నారు. ఇక ఈ కాన్వర్జేషన్ మొత్తం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

మరి ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ.. విజయ్-రష్మికల ప్రేమ విషయాన్ని బయట పెట్టబోస్తున్నారా..? అని అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇక ఈ షోలో మొత్తం పైన ఏం జరగబోతుందో తెలియాలి అంతే మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News