The Warriorr Film: రామ్​ పోతినేని 'ది వారియర్​' విడుదల తేదీ ఫిక్స్​

The Warriorr Film: రెడ్​ సినిమా ఫ్లాప్​తో ఎలాగైనా హిట్టు కొట్టాలనె కసితో ఉన్న రామ్​.. ప్రస్తుతం భారీ యాక్షన్​ మూవీ 'ది వారియర్​' మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 01:27 PM IST
  • ది వారియర్​ సినిమా విడుదల తేదీ ఫిక్స్​
  • పోలీస్​ ఆఫీసర్​గా కనిపించనున్న రామ్​
  • భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​గా రానున్న మూవీ
The Warriorr Film: రామ్​ పోతినేని 'ది వారియర్​' విడుదల తేదీ ఫిక్స్​

The Warriorr Film: యంగ్ హీరో.. రామ్ పోతినేని నటించిన కొత్త చిత్రం 'ది వారియర్' విడుదల తేదీ ఫిక్సయింది. పూర్తి స్థాయి యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ మూవీ విడుదల తేదీని ఆదివారం ప్రకటించింది చిత్ర యూనిట్​. జులై 14న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఇస్మార్ట్​ శంకర్​ లాంటి సూపర్​ హిట్ తర్వాత వచ్చిన.. రెడ్​ మూవీ అంతాగా ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లోను హిట్​ కొట్టాలని కసితో ఉన్నారు రామ్​. ఇప్పటికే విడుదలైన లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు తగ్గట్లే.. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో.. పోలీస్ ఆఫీసర్​గా నటించనున్నారు రామ్. ఇందులో మరో నటుడు ఆది పినిశెట్టి కూడా కీలక రోల్​లో నటిస్తున్నారు. ఇక మూవీలో క్యూట్​ బామ కృతి శెట్టి హీరోయిన్​నా నటిస్తోంది. అక్షర గౌడ, నదియా, భారతీ రాజ వంటి నటీ, నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ది వారియర్​ గురించి మరిన్ని విషయాలు..

ఈ మూవీని తమిళ దర్శకుడు లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్​ స్క్రీన్​ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తు్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగితమందిస్తున్నారు.

Also read: Aamir Khan: అమీర్ ఖాన్ సంచలన ప్రకటన, సినిమాలకు శాశ్వత వీడ్కోలు

Also read: Pushpa 2 Updates: పుష్ప 2 లోనూ సమంత.. ఈ సారి కాస్త డిఫరెంట్​గా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News