Ram Pothineni Record: రామ్ పోతినేని లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా తనను తాను పూర్తిగా ట్రాన్స్ ఫామ్ చేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో తన మాస్ రాంపేజ్ ఏంటో చూపించాడు. ఈ సినిమాతో రామ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత చేసిన ‘ది వారియర్’ .. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘స్కంద’ మూవీలో ఊర మాస్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తాజాగా ఈయన నటించిన సినిమాలకు హిందీలో అది కూడా యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘స్కంధ’ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తాజాగా 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది.
తెలుగులో మరే హీరో నటించిన సినిమాలకు ఈ రేంజ్ వ్యూయర్ షిప్ లేదని చెప్పాలి. గతంలో రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’, హలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజా, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం రేపాయి. దాదాపు రామ్ పోతినేని నటించిన 9 చిత్రాలు ఈ రేంజ్ లో యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం రేపడం మాములు విషయం కాదు.
దక్షిణాది నుంచి ఈ రేంజ్ లో వ్యూస్ రాబట్టిన హీరోగా రామ్ పోతినేని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. అందులో కొన్ని చిత్రాలు.. 300, 400, 500, 6000 మిలియన్ వ్యూస్ రాబట్టినవి ఉన్నాయి. ఈ లిస్టులో గణేష్, హైపర్ వంటి సినిమాలు 100 మిలియన్ వ్యూస్ తర్వాత యూట్యూబ్ లో డిలీట్ చేసారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన 7 చిత్రాలు యూట్యూబ్ లో 100 కు పైగా మిలియన్ వ్యూస్ రాబట్టాయి. మొత్తంగా టాలీవుడ్ సహా సౌత్ ఈ రేంజ్ లో యూట్యూబ్ లో తన డబ్బింగ్ సినిమాలతో రచ్చ చేసిన హీరోగా రామ్ పోతినేని నిలిచాడు. ఈయన త్వరలో హిందీలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్ లో పలకరించబోతున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది.
100 మిలియన్ వ్యూస్ ని దాటగా ఇందులో కొన్ని సినిమాలు, 300, 400, 500, ఏకంగా 600 మిలియన్ మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించడం విశేషం. కాగా ఓవరాల్ గా ఈ లిస్టులో హైపర్ మరియు గణేష్ సినిమాలు 100 మిలియన్ ను దాటిన తర్వాత ఛానెల్ లో మూవీస్ ని డిలేట్ చేశారు…
దాంతో ఓవరాల్ గా ప్రస్తుతం లైవ్ లో ఉన్న మూవీస్ పరంగా 7 సినిమాలు 100 మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా అన్ని మూవీస్ ని చూసుకుంటే 9 సినిమాలతో టాలీవుడ్ లో ఎవ్వరికీ అందనంత జోరుతో హిందీలో రచ్చ లేపుతున్నాడు…ఇక హిందీలో త్వరలో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రామ్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter