ఎన్టీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

Last Updated : Aug 9, 2018, 12:28 PM IST
ఎన్టీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాలు చేస్తూ రెండు భాషల్లోనూ బిజీ హీరోయిన్ అనిపించుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. మిడ్‌డే.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో దివంగత నటి శ్రీదేవి పాత్ర పోషించే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్‌ని వరించినట్టు సమాచారం. ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి నటించిన శ్రీదేవి పాత్రను తెరపై పోషించే అవకాశం ఎందరికో కానీ రాదు కదా! అందుకే ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్ కోరిక మేరకు రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆఫర్‌కి ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమె ఇంకా వారికి అధికారికంగా తన అంతిమ నిర్ణయం మాత్రం చెప్పలేదట. 

ఇప్పటికే సైన్ చేసిన కొత్త సినిమాల నిర్మాతలకు ఓ మాట చెప్పి, డేట్స్ అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాకే తాను పూర్తిస్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అవునానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్టు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. 

Trending News