Rajiniakanth: సూపర్ స్టార్ రజినీకాంత్ 50 యేళ్ల కెరీర్‌లో తొలిసారి అలా..

Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ నటుడి కెరీర్ ప్రారంభించి దాదాపు 50 యేళ్లు పూర్తి కావొచ్చింది. ఇన్నేళ్ల తలైవా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, మరోన్నో సూపర్ హిట్స్.. కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ లాల్ సలాం మూవీ రజినీకాంత్ ఇమేజ్ పైనే నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.    

Last Updated : Feb 15, 2024, 11:27 AM IST
Rajiniakanth: సూపర్ స్టార్ రజినీకాంత్ 50 యేళ్ల కెరీర్‌లో తొలిసారి అలా..

Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని తమిళనాటు నెంబర్ కథానాయకుడిగా నిలిచారు. ఈయన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్లు.. మరెన్నో బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఫ్లాప్స్, డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ లాల్ సలాం మూవీ మాత్రం రజినీకాంత్ కెరీర్‌లోనే మాయని మచ్చగా నిలిచిపోయింది.

రజినీకాంత్ 'రోబో' తర్వాత ఆ రేంజ్ సక్సెస్.. గతేడాది నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్' మూవీతో పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లోనే '2.O' తర్వాత ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో రజినీకాంత్ తన ఏజ్‌కు తగ్గ పాత్రలో కనిపించి మెప్పించారు.

రజినీకాంత్‌ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులో అంతే క్రేజ్ ఉండేది. ఒకప్పుడు రజినీ చిత్రం వస్తుందంటే తెలుగు హీరోలు సైతం సైడ్ ఇచ్చేసేవారు. అంతలా తెలుగులో ఈయన మ్యానియా చాలా యేళ్లు పాటు నడిచింది. ఆ తర్వాత తెలుగులో రాను రాను సూపర్ స్టార్ మార్కెట్ పడిపోతూ వచ్చింది. గతేడాది 'జైలర్' మూవీ తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. కానీ ఆ తర్వాత రజినీకాంత్ నుంచి వచ్చిన 'లాల్ సలాం' మూవీ ఆ ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

 ఇక తమిళంలో ఈ సినిమా చూడటానికి ఆయన ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. దీంతో తమిళనాడులో చాలా చోట్ల ప్రీమియర్స్ కాకుండా.. డైరెక్ట్ మార్నింగ్ షోలతో ఈ సినిమాను విడుదల చేసారు. ఇక తెలుగులో 'లాల్ సలాం' వంటి ఓ సినిమా వస్తుందని కూడా ఇక్కడ  ఆడియన్స్‌కు  కూడా తెలియలేదు. ఇక్కడ మినిమం ప్రమోషన్స్ చేయలేదు. ఈ సినిమా రిజల్ట్ పై నమ్మకం లేకపోవడంతోనే ఇక్కడ ప్రచారం చేయలేదనే విషయం అర్ధం అవుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ స్పెషల్ కెమియో అని చెప్పారు. కానీ ఈ సినిమా మొత్తం ఆయన పాత్రే ఉంది. ఈ సినిమాకు ఆయనే ప్లస్. ఆయన మైనస్ గా మారారు. తండ్రి వంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని కూడా రొటిన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించడం ఈ సినిమాకు కోలుకోలేని దెబ్బ తీసింది. తెలుగు సహా తమిళంలో ఈ సినిమా బజ్ లేకపోవడంతో ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 50 లక్షల షేర్ కూడా రాబట్టలేక చేతులేత్తేసింది. తెలంగాణలో రూ. 10 లక్షల షేర్ కూడా రాబట్టలేక చేతులేత్తేసింది.

అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని బహుశా రజినీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆయన కూడా ఊహించి ఉండరు. ఏదైతే చూడకూడదని ఆయన అభిమానులు ఆశించారో అదే జరిగింది. మొత్తంగా అయ్యో ఫాఫం అనేలా తయారైంది రజినీకాంత్ పరిస్థితి. అది కూడా 'జైలర్' వంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత రజినీ నుంచి వచ్చిన సినిమా 'లాల్ సలాం'. ఈ సినిమాలో తలైవాను యాక్ట్ చేయమని తన కూతురు ఐశ్వర్య అడగడం..లేక లేక తన కూతురు ఎన్నో ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకోవడం వంటి కొన్ని మొహమాటాల కొద్ది ఈ సినిమాను రజినీకాంత్ ఒప్పుకున్నారు. దీంతో ఫలితం అనుభస్తున్నాడు. ఈ సినిమాలో తలైవా రాకతో ఈ మూవీ లెవల్ కూడా పెరిగింది. తీరా రిలీజ్‌ సమయం వచ్చే వరకు ఈ మూవీపై ఎలాంటి హోప్స్ లేవు.

ఇక రజినీకాంత్ తన కెరీర్‌లో ఎన్నో డిజాస్టర్స్ సినిమాల్లో నటించినా.. మినిమం కలెక్షన్స్ వచ్చేవి. కానీ 'లాల్ సలాం' పరిస్థితి వేరు. ఇక తలైవా కూతురు ఐశ్వర్య మూడు సినిమాలను డైరెక్ట్ చేస్తే అన్ని సినిమాలు ఫ్లాప్స్‌గా మిగిలాయి. ఇప్పటికీ రజినీకాంత్ పాత బ్లాక్ బస్టర్స్ సినిమాలు రీ రీలిజ్ చేస్తే కూడా మంచి వసూళ్లు వస్తాయి. అటువంటిది లాల్ సలాం సినిమా రజినీకాంత్ 50 యేళ్ల కెరీర్‌లో డిజాస్టర్ అనే కంటే దానికి పది రెట్లు ఎక్కువే. మరి త్వరలో చేయబోయే లోకేష్ కనగరాజ్ సినిమాతో సూపర్ స్టార్ మరోసారి తన సత్తా చూపెడతారా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 7 ఫోటోస్ మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News