Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!

Prabhas Kalki 2898 AD Movie Public Talk: పాన్ ఇండియా వైడ్‌గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ 'కల్కి 2898 AD' థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. హౌస్ ఫుల్ షోలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోతకు సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2024, 01:20 PM IST
Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!

Prabhas Kalki 2898 AD Movie Public Talk: కల్కి 2898 AD మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి బాక్సాఫీసు వద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. మూవీకి ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కల్కి హిట్ బొమ్మ అని.. కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌కు ఫిదా అవుతున్నారు. మహాభారతాన్ని ఫిక్షన్‌తో ముడిపెట్టి.. కురుక్షేత్రం యుద్ధం తరువాత 6 వేల సంవత్సరాల జరిగే కథను అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేసేలా సినిమా ఉంది. మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటన నిలిచిపోతుంది. ఆ పాత్రలో అమితాబ్‌ను తప్పా మరొకరిని ఊహించలేం. ప్రభాస్ తన పాత్రలో జీవించేశాడు. డీగ్లామరస్ పాత్రలో దీపికా పదుకొణె అదరగొట్టింది. 

Also Read: Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహం

ఇక సినిమాలో అతిథి పాత్రల్లో మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ మెరిశారు. కథానుసారం వచ్చే పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జుడిగా నటించాడు. విజయ్‌కు సంబంధించిన సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్‌గా తెలంగాణ యాసలో మాట్లాడే రౌడీ బాయ్.. ఇందులో కొత్త డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అర్జుడిగా ఒదిగిపోగా.. రెండు మూడు డైలాగ్స్‌తో అదరగొట్టేశాడు. పార్ట్‌-2 ప్రభాస్‌తో యుద్ధ సన్నివేశాలు ఉన్నట్లు ఉన్నాయి. కల్కిలో విజయ్ పాత్రతో రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలు రావడం ఖాయం. విజయ్ లుక్, డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. బ్రహ్మనందం, ప్రభాస్ మధ్య కామెడీ ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. ఆర్‌జీవీ కోడిగుడ్డు కోసం తన స్టైల్‌లో ప్రభాస్‌తో చెప్పే డైలాగ్ ప్రేక్షకులను నవ్వులు తెప్పిస్తుంది. రాజమౌళి కూడా ఉన్నంతలో నవ్వించారు. ప్రభాస్‌ను చిన్నప్పుడు పెంచిన పైలెట్ పాత్రలో దుల్కార్ నటించాడు. దిశా ప‌టానీ స్క్రీన్ స్పెస్ తక్కువే ఉన్నా.. తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఓ షాట్‌లో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ మెరిశాడు. ఓవరాల్‌గా ప్రభాస్-నాగ్‌అశ్విన్ ఇండస్ట్రీకి మరో సూపర్ హిట్ బొమ్మ ఇచ్చేశారని మూవీ లవర్స్ అంటున్నారు.       

Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News