Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో  పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..

Kumaraswamy murder case: అభిమానిని అత్యంత క్రూరంగా హత్య చేసిన కన్నడ  ఎఫైర్ లో ఉన్న నటి పవిత్ర గౌడ, దర్శన్ లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, నటి పవిత్ర గౌడ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. 

1 /6

కన్నడ ఇండస్ట్రీలో దర్శన్, పవిత్ర గౌడల వ్వవహరం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి కుమార స్వామి అనే అభిమానిని అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసులు విచారణలో తెలింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

2 /6

రేణుక  స్వామిని చిత్రదుర్గ్ నుంచి తీసుకొని వచ్చారు. ఆతర్వాత చికెన్ బిర్యానీ నోటిలో కుక్కి, దారుణంగా హింసించారు. ప్రైవేటు పార్ట్ ల ఇష్టమున్నట్లు తన్ని పైశాచికంగా ప్రవర్తించారు. వద్దని వేడుకున్న కూడా అత్యంత పాశావికంగా దాడిచేసి మరీచంపిన ఉదంతం సభ్యసమాజంను నివ్వేరపోయేలా చేసింది.

3 /6

ఇదిలా ఉండగా నటి పవిత్ర గౌడను విచారణలో భాగంగా పోలీసులు బెంగళూరులోని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చేట్పుడు  ఆమె ముఖానికి మేకర్, లిప్ స్టిక్ వేసుకుని నవ్వుతూ రావడం వీడియోలు ఇప్పుడు బైటపడ్డాయి. ఈ క్రమంలో నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. హత్యలు చేసిన వారు నవ్వుతు కన్పిస్తున్నారు. కొంచెంకూడా పశ్చాత్తాపంలేదంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

4 /6

ఈనేపథ్యంలో ఇది కాస్త పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. రంగంలోకి దిగిన అధికారులు పవిత్ర గౌడతో ఉన్న లేడీ ఎస్సైకు నోటీసులు జారీచేశారు. ఆమెనువారించకుండా, డ్యూటీలో నెగ్లీజెన్సీ గా ఉందంటూ కూడా మండిపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

5 /6

మరోవైపు రేణుకస్వామి హత్య కేసులో రోజుకో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కన్నడ పత్రికలలో రేణుకను ఎంత క్రూరంగాచంపారో అతడి డెడ్ బాడీకు చెందిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై కన్నడ ప్రజలు, ఫిల్మ్ ఇండస్ట్రీ వారు సైతం.. వీరి పని పట్ల కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

6 /6

నెటిజన్లు అయితే.. దర్శన్, పవిత్ర గౌడలను బూతులతో ఉతికి ఆరేస్తున్నారు . కాగా , దర్శన్ రేణుక స్వామి శవంను మాయం చేయడానికి 30 లక్షల సుపారీ కూడా ఇచ్చిన విషయం కూడా వెలుగులోకివచ్చింది. దీన్ని అతగాడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన వీరికి అత్యంత కఠినమైన శిక్షను విధించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.