Asaduddin Owaisi Jai Palestine slogans in parliament: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అటు కేంద్రంలో మోదీ మూడోసారి హ్యట్రిక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పార్లమెంట్ లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దేశంలో ఇటీవల ఎన్నికైన ఎంపీలందరు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు తమ మాతృభాషలో ప్రమాణ స్వీకారంచేశారు.
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
మరికొందరు తమ సాంప్రదాయ వస్త్రాలంకరణలో పార్లమెంట్ కు వచ్చారు. తాము పుట్టిన, పెరిగిన ప్రదేశాలను ప్రతిబింబించేలా పార్లమెంట్ కు వచ్చి, అందరిదృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. కానీ హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం దేశప్రజలు తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. ఎంపీగా ప్రమాణ స్వీకారం వేళ.. అసదుద్దీన్ ఓవైసీ.. చివర్లో జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. జై పాలస్తీనా నినాదంపై పార్లమెంట్ లో తీవ్ర వివాదం రాజుకుంది.
సభ్యులు వెంటనే వీటిని రికార్డుల నుంచి తొలగించాలని, అసద్ పై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ఒక దేశంలోని అత్యున్నతమైన పార్లమెంట్ లో.. ఇతర దేశాలను పొగడటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అసద్‌పై చర్యలు తీసుకోవాలని కమలం పార్టీ నేతలు స్పీకర్‌కు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. ఈ ఘటనపై కొందరు న్యాయవాదులు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ చేసిన నినాదంపై లోక్‌సభలో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో.. అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అదే విధంగా పలువురు బీజేపీ శ్రేణులు,లాయర్లు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (డీ) ప్రకారం అసదుద్దీన్ ఓవైసీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు లాయర్ అలఖ్ అలోక్ శ్రీవాస్తవ, సీనియర్ లాయర్ విష్ణు శంకర్ జైన్ లు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రపతికి ద్రౌపదీ ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. పాలస్తీనాకు అనుకూలంగా అసదుద్దీన్ చేసిన నినాదాలపై ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ప్రస్తతం భారత్ కు ఇతర దేశాలతో సఖ్యత ఉందని, కానీ పాలస్తీనా అనుకూల నినాదాలు, అది కూడా, భారత పార్లమెంట్ లో నినాదాలు చేయడంపై పరిశీలిస్తున్నామని చెప్పారు.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
ఆర్టికల్ 102 (డీ) ప్రకారం..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 లో.. పార్లమెంటు సభ్యుల అనర్హత, విధి విధానాలను వెల్లడిస్తుంది. చట్టసభల్లోని సభ్యులు ఎవరైనా.. భారత పౌరులు అయినా కాకున్నప్పటికి.. స్వచ్ఛందంగా వాళ్లే విదేశీ పౌరసత్వాన్ని పొందినా లేక ఏదైనా వేరే దేశానికి విధేయతను డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా ప్రకటించినా.. ఆ సభ్యుడిపై వేటు వేయవచ్చని ఆర్టికల్ 102 లోని క్లాజ్ డీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అసద్ ను వెంటనే చర్యలు తీసుకొవాలంటూ పలువురు మేధావులు, లాయర్లు, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసద్ ప్రవర్తించిన తీరు దేశ సార్వభౌమాధికారానికి భంగం కల్గించడమే అంటూ రాజకీయ మేధావులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి