రాజశేఖర్ కూతురు శివాని సినిమాకు సర్వం సిద్ధం

రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.

Last Updated : Jan 23, 2018, 06:56 PM IST
రాజశేఖర్ కూతురు శివాని సినిమాకు సర్వం సిద్ధం

రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. హిందీలో హిట్ అయిన 2 స్టేట్స్ అనే సినిమాకు సంబంధించిన తెలుగు రీమేక్ వెర్షన్ ద్వారా శివాని సినీ పరిచయం జరగనుంది. 'క్షణం' ఫేమ్ అడివి శేష్ హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో శివాని ఫీమేల్ లీడ్ రోల్ పోషించనుంది. తాజాగా టాలీవుడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం శివాని తెరంగేట్రం చేయనున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ శిష్యుడు వెంకట్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నటనపరంగా తన ప్రతిభను కనబర్చడానికి అధిక అవకాశాలున్న పాత్ర కావడంవల్లే శివాని 2 స్టేట్స్ సినిమాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 

Trending News