Sanchari Song: రాధే శ్యామ్​ నుంచి 'సంచారి' పాట రిలీజ్​- ప్రభాస్​లో కొత్త కోణం..

RadheShyam Sanchari Song: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లునగా నటించిన రాధేశ్యామ్​లో మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ పాట రిప్రజెంట్​ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:49 PM IST
  • రాధేశ్యామ్​ నుంచి బిగ్​ అప్​డేట్​
  • సినిమాలో మరో ఫుల్​ సాంగ్ విడుదల
  • ప్రభాస్​లో కొత్త యాంగిల్​..
Sanchari Song: రాధే శ్యామ్​ నుంచి 'సంచారి' పాట రిలీజ్​- ప్రభాస్​లో కొత్త కోణం..

RadheShyam Sanchari Song: టాలీవుడ్​లో కొత్త సినిమాల అప్​డేట్స్ జోరందుకున్నాయి. తాజాగా ప్రభాస్​ ఫ్యాన్స్​లో జోష్​ నింపే.. కొత్త అప్​డేట్​ ఇచ్చింది 'రాధే శ్యామ్​' చిత్ర యూనిట్​. ఈ సినిమాలో మరో ఫుల్​ సాంగ్​ 'సంచారి'ని నేడు (గురువారం) విడుదల చేసింది.

'కొత్త నేలపై.. గాలి సంతకం' అంటూ సాగే ఈ పాట సినిమాలో ప్రభాస్​ క్యారెక్టర్​ను రిప్రజెంట్ చేసేలా ఉంది. లవర్​బాయ్​గా.. లైఫ్ ఎంజాయ్​ చేసే క్యారెక్టర్​లో ప్రభాస్​ కనిపించారు. పాటలో లోకేషన్స్​ ఆకట్టుకునెలా ఉన్నాయి. కొన్ని సీన్లలో ప్రభాస్​ స్టంట్లు అదుర్స్ అనిపించాయి.

రాధేశ్యామ్ గురించి..

ఈ సినిమాలో ప్రభాస్​కు జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​, సాంగ్​లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసేటట్లు ఉంది. ముఖ్యంగా ఎక్కువగా మాస్​ లుక్​లో కనిపించే ప్రభాస్ ఈ సినిమాలో లవర్​బాయ్​గా చాలా కొత్తగా కనిపిస్తున్నారు.

ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్​ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఏక కాలంలో చిత్రీకరించారు. తమిళం, కన్నడ, మళయాలంలోనూ డబ్ అయ్యింది. అన్ని భాషల్లో వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

తెలుగు పాటలకు జస్టిన్ ప్రభాకరన్​​ సంగీతం అందించగా.. హీందీ వెర్షన్​కు మిథూన్​, అమాల్​ మాలిక్​, మనన్ భరద్వాజ్​ సంగీతం అందించారు.

సాహో తర్వాత ప్రభాస్​ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

Also read: Jr NTR Dubbing: ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారిగా హిందీలో డబ్బింగ్ చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్

Also read: Pushpa Song Dispute: మగోళ్లకు కోపమొచ్చింది, ఆ పాటపై హైకోర్టును ఆశ్రయించిన పురుష సంఘం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News