Radhe Shyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'​కు అమితాబ్ వాయిస్​ ఓవర్

Prabhas-Amitabbachan: ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ హిందీ వెర్షన్​కు బాలీవుడ్​ సూపర్ స్టార్ అమితాబ్​ బచ్చన్​ వాయిస్​ ఓవర్​ ఇచ్చారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 04:17 PM IST
Radhe Shyam: ప్రభాస్ 'రాధేశ్యామ్'​కు అమితాబ్ వాయిస్​ ఓవర్

Prabhas-Amitabh Bachchan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)​ నటించిన 'రాధేశ్యామ్'​ (Radhe Shyam) హిందీ వెర్షన్​కు బాలీవుడ్​ సూపర్ స్టార్ అమితాబ్​ బచ్చన్ (Amitabh Bachchan)​ వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. ఈ మేరకు బిగ్​బీకి కృతజ్ఞతలు తెలిపింది చిత్రబృందం. ఈ మూవీని 250 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం అమితాబ్, ప్రభాస్ కలిసి 'ప్రాజెక్టు-కె'లో (Project-K) కలిసి నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్, పూజా హెగ్డే (Pooja Hedge)  హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ  శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు. తమన్ నేపథ్య సంగీతం అందించాడు. 

Also Read: 'The Kashmir Files' Trailer: ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న 'ది కశ్మీర్​ ఫైల్స్'​ ట్రైలర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News