Bhama Kalaapam 2 OTT Review: ఓటీటీలో విడుదలైన ప్రియమైన 'భామా కలాపం 2' ఎలా ఉంది.. ?

Bhama Kalaapam 2 Movie Review: జాతీయ ఉత్తమనటి ప్రియమణి.. మ్యారేజ్ తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. తాజాగా ఈమె నటించిన మరో ఓటీటీ మూవీ 'భామా కలాపం 2'. గతంలో వచ్చిన భామా కలాపం మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 16, 2024, 05:51 PM IST
Bhama Kalaapam 2 OTT Review: ఓటీటీలో విడుదలైన ప్రియమైన 'భామా కలాపం 2' ఎలా ఉంది.. ?

రివ్యూ: భామా కలాపం 2 (Bhama Kalaapam2)
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, సందీప్ వేద్, అనూజ్ గుర్వారా తదితరులు..  
సినిమాటోగ్రఫీ: దీపక్ యారగెరా
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
స్టోరీ, స్క్రీన్‌ప్లే: అభిమన్యు తడిమేటి  
నిర్మాత: బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర
దర్శకుడు: అభిమన్యు తడిమేటి
విడుదల: ఆహా ఓటీటీ  (16-2-2024)

హాట్ బ్యూటీ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భామాకలాపం’. 2022లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ విషయానికొస్తే..

భామా కలాపం ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే రెండో పార్ట్ మొదలువుతోంది. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిపోయిన తర్వాత అనుపమ (ప్రియమణి) జీవితం మరింత ఆనందంగా మారుతుంది. యూట్యూబ్‌లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ మార్కును అందుకుంటారు. తర్వాత పాత ఇంట్లో పని మనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) పార్ట్‌నర్‌గా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్‌కు అప్లై చేస్తారు. మరోవైపు ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలాగే తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా (సీరత్ కపూర్) ఐదు సంవత్సరాలుగా ఆంథోని లోబోతో ఉంటూ వస్తుంది. ఈ డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు ఎందుకు వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అన్నది తెలుసుకోవాలంటే భామా కలాపం 2 చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ..

సీక్వెల్స్ కి ప్లాట్ సేమ్ వున్నా... స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. అయితే గతంలో వచ్చిన ‘భామా కలాపం’తో పోలిస్తే ఈ సీక్వెల్‌ జోనరే వేరు. మొదటి భాగం ఒకే అపార్ట్‌మెంట్‌లో జరిగే మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగం హెయిస్ట్ థ్రిల్లర్ జోనర్. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అనుపమ కథ, ట్రోఫీ కథ, మరో పోలీసాఫీసర్ కథ సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఈ మూడు కథలూ కలుస్తాయో అక్కడ నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది. ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల మధ్య కెమిస్ట్రీనే. వీరిద్దరూ కలిసి కనిపించిన సీన్లలో ఫన్ బాగా వర్క్ అవుట్ అయింది. బయట నుంచి ఒకరు ఉండి టీమ్‌ను నడిపించడం, లోపల ఉన్నవాళ్లు దొంగతనాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనే పాపులర్ ఫార్ములాను ఇందులో కూడా ఫాలో అయ్యాయి. ఇలాంటి హెయిస్ట్ థ్రిల్లర్లకు దొంగతనాన్ని ఎలా చేశారు అనే విధానమే ప్రధాన ఆయువు పట్టు. ఆ విషయంలో ‘భామా కలాపం 2’ సక్సెస్ అయింది. ఆ హెయిస్ట్ ఎపిసోడ్ చాలా  ఎక్సైటింగ్‌ కలిగిస్తుంది. సెకండాఫ్‌లో ప్రియమణి  దొంగతనానికి వెళ్లే సీన్,  క్లైమ్యాక్స్‌ బాగున్నాయి. ఇందులోనే  సీక్వెల్‌కు లీడ్ ఇచ్చారు. వచ్చే భాగం విదేశాల్లో ఉంటుందన్నట్లు చూపించడం కొసమెరుపు. ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల క్యారెక్టరైజేషన్స్ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి సరైన స్టోరీలు పట్టుకుంటే తెలుగులో ఒక ఓటీటీ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉందనే విషయం భామా కలాపం మూవీతో ప్రూవ్ అయింది.

సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన స్వప్న సుందరి పాట వినటానికి, చూడటానికి కూడా బాగుంటుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యారగెరా విజువల్స్ బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు సినిమాని నిర్మించారు.

నటీనటుల విషయానికొస్తే..

తెలివైన గృహిణి పాత్రలో ప్రియమణి తన నటనతో ఆకట్టుకుంటారు. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్‌తో ఇందులో అనుపమ పాత్రలో కనిపిస్తుంది. ఆ ఛేంజ్‌ను ప్రియమణి చాలా చక్కగా స్క్రీన్‌పై చూపించారు. ఇక శరణ్య ప్రదీప్ పాత్ర కూడా మొదటి భాగం కంటే కాస్త ఫన్నీగా సాగుతుంది. చక్కటి నటనతో ఆకట్టుకుంది. సీరత్ కపూర్ తన గ్లామర్ నే నమ్ముకుంది. సందీప్ వేద్, అనూజ్ గుర్వారా, రఘు ముఖర్జీ, రుద్ర ప్రదీప్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇలాంటి జోనర్ ఇష్టపడే వారు  ఆహా ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ‘భామా కలాపం 2’ చూసి టైమ్ పాస్ చేయండి.

ప్లస్ పాయింట్స్
 
ప్రియమణి నటన

స్టోరీ, స్క్రీన్ ప్లే

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

ఫఫ్టాఫ్

ఎడిటింగ్

లాజిక్ లేని సీన్స్

చివరి మాట.. ఆకట్టుకునే భామా కలాపం 2 ..

రేటింగ్: 3/5

Read More: Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో అరుదైన గౌర‌వం.. భార‌త దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్క‌డు..

Read More: Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News