Prasanth Varma: కన్నీళ్లు ఆపుకోలేకున్నా.. తేజ సజ్జా పరిస్థితి అర్థమవుతోంది.. ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Teja Sajja: హనుమాన్ సినిమా ఎంతటి పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ మధ్య ఈ చిత్రం గురించి చిరంజీవి  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. దీనికి సంబంధించి ప్రశాంత్ వర్మ పెట్టిన పోస్ట్ మరింత వైరల్ అవుతుంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 13, 2024, 05:49 PM IST
Prasanth Varma: కన్నీళ్లు ఆపుకోలేకున్నా.. తేజ సజ్జా పరిస్థితి అర్థమవుతోంది.. ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Megastar Chiranjeevi: 

హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ, కల్కి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం జై హనుమాన్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా గురించి చిరంజీవి మాట్లాడిన వ్యాఖ్యలపై వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

హనుమాన్ సినిమా చూసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎంతోమంది ఈ సినిమాని మెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి చిరంజీవికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. స్వతహాగా హనుమంతుడు అంటే ఎంతో ఇష్టపడే చిరంజీవి ఈ సినిమాకి మొదటి నుంచి హనుమంతుడి పైన వస్తోన్న ఈ సినిమాకి సపోర్ట్ అందిస్తూ వచ్చారు. తాజాాాగా చిరంజీవి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ..  హనుమాన్ లాంటి సినిమాను చేయాలని కోరిక ఉండేదని. కానీ తేజ సజ్జా చేయడంతో తనకు చాలా సంతృప్తి కలిగిందంటూ చెప్పుకొచ్చాడు. ‘తేజ నా సినిమాలలో నటించారు.. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు .. ఇప్పుడు హనుమాన్ సినిమాతో దేశమంతా ఫేమస్ అయ్యాడు తాను నేను అనుకున్న హనుమాన్ చిత్రం చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. తాను కూడా నా ప్రయాణంలో భాగమే,’ అంటూ చెప్పవచ్చారు.

ఇదంతా చిరంజీవి తేజ తన ఎదురుగా కూర్చో ఉన్నప్పుడు చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటల గురించి ఎమోషనల్ అయి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘హనుమాన్ లాంటి సినిమాలో నటించాలని మెగాస్టార్ చిరంజీవి కోరిక అనేది తెలియడంతో నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషం వేసింది.. చిరంజీవి గారి మాటలతో నా భుజాల మీద మరింత బాధ్యత పెట్టినట్టుగా, పెరిగినట్టుగా అయింది.. ఈ వీడియోని చూస్తుంటే నా కంట్లో నుంచి కన్నీళ్లు ఆగడం లేదు.. ఇక అక్కడున్న తేజకు ఇప్పుడు ఎలా ఉంటుందో.. ఎలా ఫీల్ అవుతుంటాడో నేను ఊహించగలను’..అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ వెయ్యగా ఆ ట్వీట్ కాస్త తెగ వైరల్ అవుతుంది.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News