Prabhas Adipurush Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ రిలీజ్‌ ఎప్పుడంటే..

Prabhas Adipurush Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్లే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారంటే... 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 01:44 PM IST
  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
  • ఆదిపురుష్ సినిమాపై క్రేజీ అప్‌డేట్
  • సినిమా ఫస్ట్ లుక్‌పై వచ్చేసిన క్లారిటీ
Prabhas Adipurush Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ రిలీజ్‌ ఎప్పుడంటే..

Prabhas Adipurush Update: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ తెర పైకి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే అక్టోబర్ నుంచి చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంతోషానిచ్చేదే అయినప్పటికీ... అందుకోసం మరో 5 నెలల పాటు వేచి చూడటం కాస్త నిరాశ కలిగించే అంశం. 

'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా... ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా ఇతర ప్రచారాలేవీ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ దర్శకుడు ఓమ్ రౌత్‌పై కాస్త అసహనంతో ఉన్నారు. ప్రభాస్ సినిమా ఇంకెంత ఆలస్యం చేస్తారని సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చివరి రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ అవడంతో... నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభాస్ సరసన కృతి సనన్ నటించింది. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.  ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్', నాగ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత మారుతి ప్రాజెక్టులో జాయిన్ అవనున్నాడు. అలాగే, సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' అనే సినిమాను లైన్‌లో పెట్టనున్నాడు.

Also Read: Flipkart Smart Phone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. రూ.23 వేలు విలువ చేసే ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ.2,499కే..

Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బంపరాఫర్స్... రూ.60 వేలు విలువ చేసే ఈ వివో స్మార్ట్‌ ఫోన్ కేవలం రూ.36 వేలకే...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News