Prabhas marriage:'ప్రేమ అంచనాలు తప్పాయి.. అందుకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్​!

Prabhas marriage: తన పెళ్లిపై ప్రభాస్​ మరోసారి మీడియా సాక్షిగా స్పందించారు. తాను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పారు. రాధే శ్యామ్​ ట్రైలర్ ఈవెంట్​లో ప్రభాస్​ ఈ విషయంపై స్పందించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 01:44 PM IST
  • పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్​
  • ఇంకా పెళ్లి ఎందుక చుసుకోలేదో వెల్లడి
  • వైరల్ అవుతున్న ప్రభాస్​ కామెంట్స్​!
Prabhas marriage:'ప్రేమ అంచనాలు తప్పాయి.. అందుకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్​!

Prabhas marriage: పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన రాధే శ్యామ్ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఇందులో భాగంగా సినిమా కొత్త ట్రైలర్​ను బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్​. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈవెంట్​లో ప్రభాస్​, కథానాయిక పూజా హెగ్డే సహా చిత్ర బృందం పాల్గొంది.

ట్రైలర్ విడుదల అనంతరం ప్రభాస్​ సహా చిత్ర యూనిట్​ మీడియాతో ముచ్చటించింది. ఇందులో చిత్ర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్​ అడిగిన ప్రశ్నకు ప్రభాస్​ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. ఆయన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో అందులో చెప్పారు.

అందుకే పెళ్లి చేసుకోలేదు..

టాలీవుడ్​లో కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లిపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో 'మోస్ట్​ ఎలిజబుల్ బ్యాచిలర్​' ప్రభాస్​ కావడం గమనార్హం. దీనితో ప్రభాస్ తాజా కామెంట్స్ ఇంటర్నెట్​లో తెగ చక్కర్లు కొడుకున్నాయి.

ఇంతకీ ప్రభాస్ ఏం చెప్పారంటే..

రాధే శ్యామ్​ ట్రైలర్ విడుదల ఈవెంట్​లో ప్రభాస్​ను ఓ విలేకరి ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. ఈ సినిమా లవ్​ స్టోరీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా స్టోరీని ఉద్దేశిస్తూ.. ఈ సినిమాలోలా నిజ జీవితంలో ఎప్పుడైనా ప్రేమ విషయంలో అంచనాలు తప్పాయా? అన్న ప్రశ్నకు ప్రభాస్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.

నిజ జీవితంలో చాలా సార్లు ప్రేమ విషయంలో అంచనాలు తప్పాయన్నారు ప్రభాస్​. తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదేనన్నారు. దీనితో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి.

ప్రభాస్ పెళ్లిపై చర్చ..

బాహుబలి తర్వాత ప్రభాస్​ పెళ్లి అంటు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాహో వచ్చింది.. ఇప్పుడు రాధే శ్యామ్​ రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా ప్రభాస్​ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ (షూటింగ్ పూర్తయింది)​, సలార్​, ప్రాజెక్ట్​ కే, స్పిరిట్​ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్ని సినిమాల మధ్య బిజీగా ఉన్న ప్రభాస్​ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అన్న విషయం ఇప్పుడు హాట్​ టాపిగ్​గా మారింది.

Also read: Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు: నాగార్జున హీరోయిన్

Also read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News