Devara Break-Even: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. కొరటార శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.
రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఎడాది దసరా సందర్భంగా అక్టోబర్ 10 న విడుదల కి సిద్ధం అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు.
రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ లో కూడా ఎక్కువగానే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కరణ్ జోహార్ 50 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తో 120 కోట్ల దాకా బిజినెస్ చేసింది. ఇది కొరటాల శివ కెరియర్ లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంది. తమిళ్, మలయాళం, కన్నడ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడవగా ఓవర్సీస్ లో సినిమా 27 కోట్ల బిజినెస్ చేసింది. కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరడానికి 60 కోట్ల దాకా వసూలు చేయాల్సి ఉంటుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుంటే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది. ఇది ఒక రకంగా చాలా పెద్ద నంబర్ అని చెప్పుకోవచ్చు. మరి ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఈ సినిమా కలెక్షన్లకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?
Also Read: Revanth Is Lilliput: 'రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్': కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter