Thammudu: పవన్ దర్శకుడితో పవర్ స్టార్ టైటిల్ తో జనసేనాని నిర్మాత తెరకెక్కుతోన్న నితిన్ ‘ మూవీ..

Nithiin - Thammudu: టాలీవుడ్ హీరో నితిన్.. పవన్ కళ్యాన్ కు పెద్ద ఫ్యాన్ అనే కంటే భక్తుడని చెప్పాలి. ఆయనంటే అపార గౌరవం. అందుకే ఇపుడు తన ఫేవరేట్ హీరో టైటిల్ తో ఆయన డైరెక్టర్ తో ఆయనతో సినిమాను నిర్మించిన నిర్మాతతో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 20, 2025, 08:10 PM IST
Thammudu: పవన్ దర్శకుడితో పవర్ స్టార్ టైటిల్ తో జనసేనాని నిర్మాత తెరకెక్కుతోన్న నితిన్ ‘ మూవీ..

Nithiin - Thammudu: తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా   శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ ముఖ్యపాత్రలో నటిస్తోంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధమే ఉంది. హీరో నితిన్ ఈ బ్యానర్ లో  దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలు చేశారు. అంతేకాదు నితిన్ మూవీ ‘దిల్’ తోనే ఈ బ్యానర్ లాంఛనంగా ప్రారంభం కావడం విశేషం.

ఇక దిల్ రాజు, నితిన్ కు బంధుత్వం కూడా ఉంది. ఇపుడు ఆ బ్యానర్ లో వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రం ‘తమ్ముడు’ కావడం గమనార్హం. డైరెక్టర్  శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ వంటి  హిట్ చిత్రాలు ఈ బ్యానర్ లోనే తెరకెక్కించాడు.  ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో ‘తమ్ముడు’ సినిమా వస్తుండటం విశేషం.  పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్ కావడంతో తమ్ముడు సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ప్రస్తుతం ‘తమ్ముడు’ సినిమా చిత్రీకరణ లాస్ట్ కు చేరుకుంది. పొంగల్ ఫెస్టివల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను  శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు వీలైనంత త్వరగా హై క్వాలిటీతో మూవీ కంప్లీట్ చేసేందుకు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను ‘తమ్ముడు’ సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. త్వరలోనే ‘తమ్ముడు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News