SPY Movie Twitter Review: స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ రెస్పాన్స్ ఇదే..!

Nikhil Siddharth SPY Movie Twitter Talk: నిఖిల్ సిద్ధార్థ్‌, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన మూవీ స్పై. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (జూన్ 29) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ట్విట్టర్‌లో పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం..!  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 29, 2023, 08:52 AM IST
SPY Movie Twitter Review: స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ రెస్పాన్స్ ఇదే..!

 Nikhil Siddharth SPY Movie Twitter Talk:  కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్‌. మరోసారి డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్‌ను అలరించేందుకు స్పై మూవీతో రెడీ అయ్యాడు. గ్యారీ బీహెచ్ డైరెక్షన్‌లో రూపొందించిన ఈ సినిమాను ఈడీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశేఖర్ రెడ్డి కె నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన స్పై నేడు ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సినిమా విడుదల సందర్భంగా చిత్రయూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. యూఎస్ ప్రీమియర్‌లో ఇప్పటికే షోలు వేశారు. ట్వీట్టర్‌లో టాక్ ఎలా ఉందో చూద్దాం..

 

 

"యూఎస్‌ఏ ప్రీమియర్ బాక్సాఫీస్ విజేత నుంచి స్పై మూవీకి మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. హీరో నిఖిల్‌, చిత్ర బృందానికి అభినందనలు. 3 వరుస హిట్స్‌తో రచ్చ చేస్తున్న నిఖిల్ సిద్ధార్థ్.." అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలను క్రాస్ చేసింది.. ముఖ్యంగా నిఖిల్ నటన చాలా బాగుంది.. అందరూ వెళ్లి ఈ సినిమా చూడండి.. అని రివ్యూ ఇస్తున్నారు.

 

కంటెంట్, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకాండఫ్‌ మరో లెవెల్‌లో ఉందని అంటున్నారు. కొన్ని చోట్ల సీన్స్‌ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు. నిఖిల్ యాక్టింగ్ ఔట్‌స్టాండింగ్ అని.. డైరెక్టర్ ఆడియన్స్‌ను ఎంగేజ్ సీన్లను తీశాడని కొనియాడుతున్నారు. మొత్తానికి స్పై మూవీకి ట్విట్టర్‌లో మంచి టాక్ వస్తుండడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

  

Trending News