Navdeep Drug Case: హీరో నవదీప్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ కేసులో అరెస్టు తప్పదా?

హైదరాబాద్‌లో మరో సారి డ్రగ్స్ కేసు కలకలం రేపుతోందో. మాదాపూర్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ దందా జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దాడి చేయగా రామచంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. వ్యక్తి ద్వారా హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావించారు. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2023, 02:58 PM IST
Navdeep Drug Case: హీరో నవదీప్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ కేసులో అరెస్టు తప్పదా?

Madhapur Drugs Case: తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా డ్రగ్స్ వినియోగం కలవరాన్ని సృష్టిస్తోంది. ఇటీవలే మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొందరు టాలీవుడ్ ప్రముఖులు పట్టుబడ్డడంతో దీనిపై ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది. ఈ కేసు విచారణలో ప్రధాన పాత్రధారి దగ్గర నుంచి వివరాలను పోలీసులు సంపాదించారు. అందులో హీరో నవదీప్ డ్రగ్స్ వినియోగించినట్లు నార్కోటిక్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. 

అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం మాదాపూర్ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతోందని పోలీసులుకు సమాచారం వచ్చింది. వెంటనే సదరు దందా జరుగుతున్న అపార్ట్ మెంట్ కు వెళ్లి దాడి చేసిన పోలీసులు రామచంద్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ద్వారా హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావించారు. అదే విషయాన్ని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అయితే తొలుత తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించిన హీరో నవదీప్.. ఆ తర్వాత కోర్టులో ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే హైకోర్టులో స్టే తెచ్చుకున్న నవదీప్ కు ఇప్పుడు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవలే దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఇప్పుడు డిస్పోజ్ చేసింది. సదరు హీరోకి బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. 41A సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. 

Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   

విచారణకు హాజరు కావాల్సిందే!
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్ విచారణ కోసం పోలీసులకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు కూడా చేసింది. అయితే పోలీసులు ఈ సోదాలు చేసే సమయంలో హీరో ఇంట్లో లేడని అధికారులు తెలిపారు. నిన్నటి వరకు నవదీప్‌ను అరెస్టు చేయోద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోగా.. నేడు మరోసారి ఆయన వేసిన పిటిషన్ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు.. హీరో నవదీప్ కస్టడీ కావాలని కోరారు. అయితే ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ను 37వ నిందితుడిగా నార్కోటిక్ పోలీసులు కేసులో చేర్చారు. నిందితుడు రామ్ చందు దగ్గర నుంచి హీరో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చంద్ ను అరెస్టు చేసిన పోలీసులు.. తాజా కోర్టు తీర్పుతో నవదీప్ ను విచారించడం సహా అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Samantha Naga Chaitanya: నాగచైతన్యతో ప్యాచ్-అప్‌కు సమంత రెడీ?.. ఇదిగో సాక్ష్యం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News