Aay: విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్ బావమరిది సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Aay Premiere: ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఆయ్. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో, విభిన్న ప్రమోషనల్ కంటెంట్ తో.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 29, 2024, 10:35 PM IST
Aay: విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్ బావమరిది సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Aay Paid Premiers: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్ బావమరిదిగా నార్నె నితిన్ 2023 లో మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  నార్నె నితిన్ ఇప్పుడు మరొక సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

ప్రముఖ టాలివుడ్ నిర్మాణ సంస్థ‌ GA2 పిక్చర్స్ బ్యానర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాలో నార్నే నితిన్ హీరోగా నటిస్తున్నారు. నయన్ సారిక నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

యువ నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫన్ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే విభిన్న ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అంతేకాకుండా ఆయ్ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు కూడా ఆల్రెడీ చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా మారి అన్నీ చోట్లా వినిపిస్తూనే ఉన్నాయి. 

ఇక సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్ ను ఆగస్టు 15 న ప్రదర్శిస్తున్నారు. గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమా కథలో కడుపునిండా న‌వ్వుకునేలా మంచి ఎంటర్టైనింగ్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. 

స్టార్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా పని చేశారు. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం GA2 పిక్చర్స్ స్పెషాలిటీ. కాబట్టి ఆయ్ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే మ్యాడ్ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించిన నార్నె నితిన్ ఇప్పుడు మరొక ఫన్ ఎంటర్టైనర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సినిమా కూడా మ్యాడ్ లాగానే హిట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా కాకుండా నార్నె నితిన్ మ్యాడ్ సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ మ్యాక్స్ తో కూడా బిజీగా ఉన్నారు.

Read more: Shravana mass 2024: ఆగస్టు నెలలో శ్రావణంతో సహా రాఖీ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి పండుగల తేదీలివే..

Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News