Super Star Krishna 3rd Day Ceremony: సూపర్ స్టార్ కృష్ణ చిన్నకర్మ.. జంటగా నివాళి అర్పించిన నరేష్‌ పవిత్ర

Super star Krishna 3rd Day Ceremony నరేష్ పవిత్రలు ప్రస్తుతం మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణను హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ తరువాత చికిత్స పొందుతూ మరణించడం, అంతిమ యాత్ర ఇలా అన్ని చోట్లా పవిత్రా లోకేషలు జంటగానే కనిపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 06:13 PM IST
  • సూపర్ స్టార్ కృష్ణ మరణం
  • చినకర్మకు హాజరైన ప్రముఖులు
  • జంటగా నివాళి అర్పించిన పవిత్ర, లోకేష్‌
Super Star Krishna 3rd Day Ceremony: సూపర్ స్టార్ కృష్ణ చిన్నకర్మ.. జంటగా నివాళి అర్పించిన నరేష్‌ పవిత్ర

Super star Krishna 3rd Day Ceremony : సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణించి మూడు రోజులు అవుతుండటంతో.. చిన్నకర్మను నిర్వహించింది ఘట్టమనేని ఫ్యామిలీ. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్‌, రాఘవేంద్రరావు ఇలా అందరూ వచ్చారు. నిర్మాత చినబాబు కూడా కార్యక్రమానికి వచ్చి కృష్ణకు నివాళి అర్పించాడు.

ఇక మొదటి సారిగా రమేష్ బాబు ఫ్యామిలీ ఈ ఈవెంట్లో కనిపించింది. రమేష్‌ బాబు కొడుకు, కూతురు, భార్య అందరూ నివాళులు అర్పించారు. ఇక తన అన్న ఫ్యామిలీతో కలిసి మహేష్‌ బాబు కాసేపు ముచ్చటించినట్టు కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో అందరిదీ ఒకెత్తు అయితే.. పవిత్ర, నరేష్‌ల అప్పియరెన్స్ ఒకెత్తు. కృష్ణను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటి నుంచి.. అంతిమ యాత్ర వరకు ఈ జంట పక్షులు మాత్రం నానా హంగామా చేశారు. పైగా ఈఇద్దరూ మేకప్‌లు వేసుకుని రావడంపై అక్కడున్న అభిమానులు కూడా గుసగుసలాడుకున్నట్టు టాక్.

ఇక నిన్న జరిగిన కృష్ణ చిన్న కర్మ కార్యక్రమంలోనూ పవిత్ర, నరేష్ జంటగానే నివాళులు అర్పించారు. పవిత్ర, నరేష్ బంధం మీద జరిగిన రచ్చ.. నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన హల్చల్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా కూడా నరేష్‌ పవిత్రలకు ఫుల్ క్రేజ్ ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుఝామున కాంటినెంటెల్ హాస్పిటల్‌కు కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే ఆయన్ను  హాస్పిటిల్‌కు తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేడని వైద్యులు తెలిపారు. ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, కండీషన్ క్రిటికల్‌గా ఉందని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. చివరకు మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Also Read : Kantara OTT Release Date : ఓటీటీలోకి కాంతారా.. ఎప్పుడు ఎక్కడంటే?

Also Read : Bigg Boss Team : సూపర్ స్టార్ కృష్ణకు బిగ్ బాస్ నివాళి.. ఆ పాటతో కంటెస్టెంట్లలో అయోమయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News