Bhagavanth Kesari: భగవంత్ కేసరి నుంచి నయా పోస్టర్ విడుదల.. ఊరమాస్‌ లుక్ లో బాలయ్య..

Bhagavanth Kesari Movie: బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'భగవంత్ కేసరి'. తాజాగా ఈ సినిమా నుంచి నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ ఎలా ఉందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 07:06 PM IST
Bhagavanth Kesari: భగవంత్ కేసరి నుంచి నయా పోస్టర్ విడుదల.. ఊరమాస్‌ లుక్ లో బాలయ్య..

Bhagavanth Kesari new Poster: నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి (Bhagavanth Kesari). మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబరు 19న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదలకు ఇంకా 70 రోజులే ఉందంటూ చిత్రయూనిట్ మరో కొత్త పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ చేతిలో గొడ్డ‌లి పట్టుకొని పుల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) నటిస్తోంది. మరో కీ రోల్ లో లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల (Sreeleela) సందడి చేయబోతుంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు అర్జున్‌ రాంపాల్‌ విలన్ గా నటిస్తున్నాడు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఎన్‌బీకే 108గా వస్తున్న ఈ సినిమా భారీగానే అంచనాలు ఉన్నాయి. 

Also Read: Jailer Movie OTT: ఓటీటీలోకి జైలర్ మూవీ.. స్ట్రీమింగ్ అక్కడే.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..?

రీసెంట్ గా బాలయ్య తన 109వ ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించారు. ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఇది తెరకెక్కనుంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్‌పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.  ఇనుప పెట్టెలో కత్తులు, గొడ్డలి, సుత్తి, సిగరెట్‌  పెట్టె, మందు బాటిల్‌, తుపాకీ గుళ్లు ఉన్నాయి. పోస్టర్‌పై 1982 అని రాసి ఉంది. ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ తో డిఫరెంట్‌ ఫ్లాష్‌బ్యాక్‌తో బాబీ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది. బాబీ ఇటీవల చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీశాడు. 

Also Read: Gandeevadhari Arjuna Trailer: 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో..': ఉత్కంఠగా వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News