IPL 2024 Awards and Winners: ఐపీఎల్ 2024లో వివిధ అవార్డులు విజేతల వివరాలు ఇలా

IPL 2024 Awards and Winners: ఐపీఎల్ 2024 వేడుక ముగిసింది. చెన్నై స్డేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ విజయంతో మూడోసారి టైటిల్ గెల్చుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ సందర్భంగా విజేతల వివరాలు తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2024, 06:30 AM IST
IPL 2024 Awards and Winners: ఐపీఎల్ 2024లో వివిధ అవార్డులు విజేతల వివరాలు ఇలా

IPL 2024 Awards and Winners: అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, అదరగొడుతున్న బ్యాటర్లతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్కసారిగా నిరాశపర్చింది. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసి కేకేఆర్ విజయానికి కారణమైంది. అత్యల్ప స్కోరు కావడంతో అలవోకగా ఛేదించి మూడోసారి టైటిల్ ముద్దాడింది కేకేఆర్ జట్టు. ఈ నేపధ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ 17 లో వివిధ అవార్డులు, విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ 2024 విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ సాధిస్తే రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలవడం రెండోసారి ఇది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు 741 చేయడం ద్వారా టోర్నీలో కీలకమైన ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెల్చుకున్న భారతీయ ప్లేయర్ కోహ్లీనే. 2016 సీజన్ లో 973 పరుగులతో ఆరెంజ్ క్యాప్ మొదటిసారి గెల్చుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు చెందిన హర్షల్ పటేల్ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెల్చుకున్నాడు. ఇక అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ అవార్డును కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ దక్కించుకోగా టోర్నీలో అత్యధిక సిక్సర్ల అవార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ అభిషేక్ శర్మ 42 సిక్సర్లతో సాధించాడు. ఇదే జట్టుకు చెందిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి గెల్చుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ లేదా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మిచెల్ స్టార్క్ దక్కించుకున్నాడు. ఫైనల్‌లో అతడు 3 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డను ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ గెల్చుకున్నాడు. 

సీజన్ బెస్ట్ క్యాచ్ కేకేఆర్ కు చెందిన రమణదీప్ గెల్చుకోగా ఫెయిర్ ప్లే అవార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెల్చుకుంది. ఇక హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్డేడియం సీజన్ బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డుకు ఎంపికైంది. 

Also read: Remal Cyclone live updates: తీరం దాటిన రెమాల్ తుపాను, బెంగాల్‌లో భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News