7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!

7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే.. ఆటోమేటిక్‌గా జీరో అవుతుందా..? తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుంది..? అనేది క్వశ్చన్ మార్క్‌గా మారింది.
 

1 /7

2004లో 5వ వేతన సంఘం అమలులో ఉన్నప్పుడు డీఏ 50 శాతానికి చేరినప్పుడు.. బేసిక్‌ పేలో కలిపేశారు. అయితే తరువాత అలాంటి సిఫారసులు ఏమీ రాలేదు.  

2 /7

గతంలో మాదిరే బేసిక్ పేలో డియర్‌నెస్ అలవెన్స్‌ను కలపాలని కేంద్ర ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

3 /7

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు డీఏ, డీఆర్ పెంపు తరువాత పిల్లల ఎడ్యూకేషన్ స్టైఫండ్, వసతి సబ్సిడీతో సహా కొన్ని అలవెన్సులు ఆటోమేటిక్‌గా 25 శాతం వరకు పెరిగింది.   

4 /7

జూలై నెలలో కొత్త డీఏ పెంపు ఉంటుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి డీఏ- డీఏ-బేసిక్ పే లింకేజీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.   

5 /7

పెన్షన్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు అంటే 25 శాతం పెంచుతూ గత నెలలో ఈపీఎఫ్‌ఓ ​​ఉత్తర్వు జారీ చేసింది.    

6 /7

డీఏ, డీఆర్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే.   

7 /7

డీఏ పెంపుతో కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. డీఏ 50 శాతానికి చేరడంతో ఈ మొత్తాన్ని బేసిక్ పేలో కలిపేసి జీరో నుంచి లెక్కించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. 2004లో 5వ వేతన సంఘం అమలులో ఉన్నప్పుడు డీఏ 50 శాతానికి చేరినప్పుడు.. బేసిక్‌ పేలో కలిపేశారు. అయితే తరువాత అలాంటి సిఫారసులు ఏమీ రాలేదు.