Mukesh Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. ఇంద్రభవనం.. ముఖేష్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!

Mukesh Ambani House Inside Pics: ఆసియాలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి పేరు ఆంటిలియా. ముంబైలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ముఖేష్ అంబానీ ఇల్లు ఒకటి. ఈ ఇంటిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించగా.. ఆస్ట్రేలియన్ కంపెనీ లాంగ్టన్ హోల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఇల్లు పిక్స్ చూశారా..? లోపల ఇంద్రభవనంలా ఉంటుంది.
 

1 /7

ఈ ఇల్లు మొత్తం 27 అంతస్తులు ఉంటుంది. ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా పేరును పెట్టారు.   

2 /7

ఈ భవనంలో మూడు హెలిప్యాడ్‌లు నిర్మించగా.. 168 కార్లను పార్క్‌ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు.   

3 /7

ఈ ఇంటి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లను వెచ్చించారు. మొత్తం 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.     

4 /7

ముకేష్ అంబానీ కుటుంబం మొత్తం ఈ ఇంట్లోనే ఉంటుంది. అందరికీ వసతి కల్పించడానికి విలాసవంతమైన సౌకర్యాలతో అంతస్తులను నిర్మించారు.   

5 /7

భారీ భూకంపాలను సైతం ఈ ఇల్లు తట్టుకోగలదు. రికార్టు స్కేలుపై 8 తీవ్రతతో వచ్చినా చెక్కు చెదరదు.  

6 /7

పార్కింగ్‌పై అంతస్తులో 50 సీట్ల సామర్థ్యంతో సినిమా హాల్ కూడా ఉంది. యోగా స్టూడియో, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.   

7 /7

టెంపుల్, 9 లిఫ్టులు, స్పా కూడా ఉన్నాయి. ఒక్కో అంతస్తు ఒక్కో విధంగా డిజైన్ చేశారు.