Nagajuna - Naa Saami Ranga closing collections: 'నా సామి రంగ' మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. నాగార్జున రేంజ్‌కు ఇది ఒక హిట్టేనా..?

Nagarjuna - Naa Saami Ranga closing box office collections: నాగార్జున అక్కినేని ఘోస్ట్ మూవీ తర్వాత హీరోగా నటించిన  మూవీ 'నా సామిరంగ'. ఈ మూవీ పొంగల్ పోటీలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమాకు పెట్టింది ఎంత ? చేసిన బిజినెస్ ఎంత ? టోటల్‌గా వచ్చింది ఎంతంటే ?

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 18, 2024, 05:44 PM IST
Nagajuna - Naa Saami Ranga closing collections: 'నా సామి రంగ' మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. నాగార్జున రేంజ్‌కు ఇది ఒక హిట్టేనా..?

Nagarjuna - Naa Saami Ranga closing box office collections: అక్కినేని నాగార్జనకు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. బంగార్రాజు తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. బంగార్రాజు తర్వాత చేసిన 'ది ఘోస్ట్' సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో గ్యాప్ తీసుకొని మరి 'నా సామిరంగ' అంటూ పక్కా విలేజ్ మాస్ డ్రామాతో ప్రేక్షకులను ఈ సంక్రాంతి సీజన్‌లో పలకరించాడు. ఈ మూవీ నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్‌గా మారి మెగాఫోన్ పట్టుకున్నాడు. ఈ మూవీ మలయాళంలో హిట్టైన 'పొరింజు మరియం జోస్‌'రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను నాగార్జున ఇమేజ్‌తో పాటు తెలుగు నేటివిటికి తగ్గట్టు తెరకెక్కించి మంచి సక్సెస్‌ను నాగార్జునకు అందించింది. 'నా సామి రంగ' మూవీలో  నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ నటించింది.

అంతేకాదు ఇతర ముఖ్యపాత్రల్లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు నటించారు. ఈ మూవీతో షబీర్ కల్లకరల్ విలన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీని 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. రా విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. అదే 'నా సామి రంగ'మూవీకి కలిసొచ్చింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఫిబ్రవరి 17 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

'నా సామి రంగ' మూవీ తెలుగులో రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. నాగార్జున రేంజ్‌కు ఇది చాలా తక్కువ. కానీ సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా తమ మార్కెట్ కోల్పోతున్నారు. చిరంజీవి, బాలయ్యకు తప్పించి మిగతా సీనియర్ హీరోలు తమ మార్కెట్ రేంజ్ తగ్గిపోయింది.
 
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..రూ.21.88 కోట్ల షేర్ (రూ.38 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా 2024లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రెండో హిట్‌గా నిలిచింది నాగార్జున 'నా సామి రంగ' మూవీ. ఓవరాల్‌గా  థియేట్రికల్‌గా ఈ మూవీ రూ. 2.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ మూవీ నాన్ థియేట్రికల్‌గా రూ. 40 కోట్ల వరకు అమ్ముడు పోయినట్టు సమాచారం.  

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News