Naga Chaitanya: సమంత కుక్కకి నాగచైతన్య థాంక్స్.. ప్రేమించడం ఎలానో నేర్పావంటూ ఎమోషనల్

Naga Chaitanya: సమంతతో విడిపోయినప్పటి నుంచి ఆమె గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపించని నాగచైతన్య ఇప్పుడు ఆమె కుక్క పిల్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 11:24 AM IST
  • తల్లి, తండ్రికి చైతూ థాంక్స్
  • సమంత పెంపుడు కుక్కకి కూడా
  • ఆసక్తికరంగా మారిన పోస్ట్
Naga Chaitanya: సమంత కుక్కకి నాగచైతన్య థాంక్స్.. ప్రేమించడం ఎలానో నేర్పావంటూ ఎమోషనల్

Naga Chaitanya Emotional words about Samantha pet hash: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయినప్పటి నుంచి వారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెడుతున్నా అవి వెంటనే వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు సమంత తాను విడాకులు తీసుకోవడం వల్ల చాలా బాధపడుతున్నాననే విషయాన్ని తన అభిమానులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం చాలా ప్రయత్నించింది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె అలాంటి పోస్టులు తగ్గించి తన వర్క్ కి సంబంధించి ఎక్కువ పోస్టులు పెట్టడానికి ట్రై చేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

అందులో ఆయన తన తల్లి తండ్రితో పాటు సమంతతో కలిసి ఉన్నప్పుడు పెంచుకున్న కుక్కపిల్ల గురించి కూడా మెన్షన్ చేశాడు. తన తల్లితో ఒక ఫోటో, తన తండ్రితో ఒక ఫోటో షేర్ చేయడమే కాక సమంత పెంచుకునే పిట్ బుల్ డాగ్ హ్యాష్ తో కూడా ఒక ఫోటో షేర్ చేశాడు. అసలు విషయం ఏమిటంటే నాగచైతన్య హీరోగా రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించిన థాంక్యూ అనే సినిమా జూలై 22వ తేదీన విడుదలవుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాగచైతన్య చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. థాంక్యూ అనేది చాలా గొప్ప పదం అని చెప్పుకొచ్చిన నాగచైతన్య మనం కొన్నిసార్లు దీన్ని ఎక్కువగా వాడుతుంటాం కానీ దాన్ని కొందరికే చెబుతూ ఉంటాం అని చెప్పుకొచ్చారు. కొందరికి మనం ఎక్కువగా ఈ థ్యాంక్స్ చెప్పలేమని చెబుతూనే తాను తన జీవితంలో ముగ్గురికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నానని చెబుతూ తన కన్నతల్లి, తండ్రితో పాటుగా సమంత పెంచుకునే పిట్ బుల్ డాగ్ హ్యాష్ ఫోటో కూడా షేర్ చేశాడు.

ఈ పోస్ట్ ను నా జీవితంలో చాలా ముఖ్యమైన వారికి అంకితం ఇస్తున్నానని చెప్పుకొచ్చిన నాగచైతన్య వారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదని అందుకే మీరు కూడా మీ జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలు షేర్ చేయమని కోరాడు. ద మ్యాజిక్ వర్డ్ ఈజ్ థాంక్యూ అనే ఒక హ్యాష్ టాగ్ ఇచ్చి మీరు థాంక్స్ చెప్పాలనుకున్న వారి ఫోటోలు షేర్ చేయమని అన్నాడు. ముందుగా తన తల్లితో ఫోటో షేర్ చేసిన నాగచైతన్య అమ్మ నాకు ప్రాణం, చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచింది, ఎనలేని ప్రేమను పంచింది అని చెప్పుకొచ్చారు.

ఇక నాగార్జునతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన నాగచైతన్య నాన్న ఒక స్నేహితుడు కంటే ఎక్కువగా నాతో ఉంటూ నాకు సరైన మార్గాన్ని మార్గదర్శకత్వం చేశారు అని చెప్పుకొచ్చాడు. ఈ సమంత పెంచుకుంటున్న కుక్క ఫోటో షేర్ చేసిన చైతూ ఎలా ప్రేమించాలి? మనిషిలా ఎలా ఉండాలి అని తనకు హ్యాష్ నేర్పించిందని చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు తన జీవితంలో ముఖ్యమైన వారు అంటూ నాగచైతన్య పోస్ట్ చేశాడు. విడాకులు తీసుకోకుండా ఉండి ఉంటే సమంత ఫోటో కూడా షేర్ చేసి ఉండేవాడేమో కానీ ఇప్పుడు ఆమె కుక్క ఫోటో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అన్నట్టు విడాకుల తర్వాత హ్యాష్ కు నాగచైతన్య దూరమయ్యారు. దానికి కారణం నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత తనతో పాటు ఆ కుక్క పిల్లని తీసుకు వెళ్ళింది. సమంత దగ్గర ఇప్పుడు ఈ హ్యాష్ కుక్కపిల్లతోపాటు సాషా అనే మరో కుక్కపిల్ల కూడా పెరుగుతుంది.

Also Read:Vijayendra Prasad: రాజ్యసభకు బాహుబలి క్రియేటర్ విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజా సహా ఎవరెవరంటే?

Also Read: Liger: అనన్య పెదాలు పిండేస్తున్న విజయ్.. పూరీ మార్క్ పోస్టర్ తో అప్డేట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు,    వినోదం,    రాజకీయాలు,    విద్య,    ఉద్యోగాలు,    హెల్త్,    లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter ,    Facebook

Trending News