Naga Chaitanya: నాగ చైతన్య మరో బంపర్ రికార్డు.. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ ఇదే..

Naga Chaitanya: నాగ చైతన్య హీరోగా సక్సెస్ అందుకొని చాలా రోజులే అవుతోంది. ప్రస్తుతం నాగ చైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలకు ముందే చైతూ మరో రికార్డును నమోదు చేసాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2024, 12:57 PM IST
Naga Chaitanya: నాగ చైతన్య మరో బంపర్ రికార్డు.. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ ఇదే..

Naga Chaitanya: నాగ చైతన్య.. అక్కినేని మూడో నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా స్టార్స్ గా సత్తా చాటుతున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం ఇప్పటికీ స్టార్ హీరో కాలేకపోయాడు. ఆ సంగతి పక్కన పెడితే.. తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఈయన చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత భారీ అంచనాలే నెలకొన్నాయి. హిందూస్థాన్, పాకిస్తాన్ నేపథ్యంలో 1970 బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. గతంలో చైతూ, చందూ కాంబినేషన్‌లో వచ్చిన 'సవ్యసాచి' మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. కానీ చందూ ఆ తర్వాత కార్తికేయ 2తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు.

ఇక హీరోగా నాగ చైతన్యతో చేస్తోన్న తండేల్ మూవీని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో  సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు ముందు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ. 40 కొనుగోలు చేయడం హాట్ టాపిగా మారింది. నాగ చైతన్య కెరీర్‌లో ఓ సినిమా అది కూడా విడుదలకు ముందు ఈ రేంజ్‌లో డిజిటల్ హక్కులు అమ్ముడుపోవడం తొలిసారి. మొత్తంగా డైరెక్టర్ చందూ మొండేటి ట్రాక్ రికార్డ్ పై నమ్మకంతోనే నాగ చైతన్య సినిమా ఈ రేంజ్‌కు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. మొత్తంగా చైతూ కెరీర్‌లోనే ఇదే బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్‌ అని చెప్పొచ్చు. ఈ సినిమాను దసరా కానుకగా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు నిర్మిస్తున్నాడు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News