Thandel Glimpse: 'ఈపాలి ఏట గురితప్పేదేలే' అంటున్న నాగ చైత‌న్య... 'తండేల్' గ్లింప్స్ అదుర్స్..

Thandel Glimpse: నాగ చైతన్య-చందు మెుండేటి కాంబోలో రాబోతున్న సినిమా 'తండేల్'. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల టీజర్ లోనే కథ మెుత్తం చెప్పేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 01:19 PM IST
Thandel Glimpse: 'ఈపాలి ఏట గురితప్పేదేలే' అంటున్న నాగ చైత‌న్య... 'తండేల్' గ్లింప్స్ అదుర్స్..

Naga Chaitanya Thandel Glimpse Out: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) నయా మూవీ 'తండేల్'(Thandel Movie). చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్ కు ఆడియెన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింఫ్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence Of Thandel) పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 

గ్లింప్స్ తోనే కథ చెప్పేశారు మేకర్స్. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతారు. అయితే వారు పాకిస్థాన్ నుంచి ఎలా బయటపడ్డారనేది మూవీ కథాంశంగా తెలుస్తోంది. ఇందులో ప్రేమకథతోపాటు దేశభక్తిని కూడా జోడించారు.గ్లింప్స్ చివరలో సాయి పల్లవిని చూపించి.. ఆమె ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు మేకర్స్. 'దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి ఏట గురితప్పేదేలే..ఇక రాజులమ్మ జాతరే' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ మూవీ కోసం బాడీ ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు చైతూ. ఈ చిత్రం కోసం తన మేకోవర్ ను మెుత్తం మార్చేశాడు. గుబురు గడ్డం, జుట్టు పెంచి మాంచి మాసీ లుక్ లో  కనిపిస్తున్నాడు. అంతేకాకుండా చైతూ మాట్లాడిన శ్రీకాకుళం యాస కూడా బాగానే ఉంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News