Nabha Natesh: నభా నటేష్ డార్లింగ్ డైలాగ్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్.. ఇస్మార్ట్ గా వాడేస్తోన్న నెటిజన్స్..

Nabha Natesh: నభా నటేష్ తెలుగులో తనదైన గ్లామర్ తో దూసుకుపోతుంది. ఆ మధ్య జరిగిన యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్ గా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అందులో ఈమె చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 2, 2024, 12:56 PM IST
Nabha Natesh: నభా నటేష్ డార్లింగ్  డైలాగ్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్..  ఇస్మార్ట్ గా వాడేస్తోన్న నెటిజన్స్..

  

Nabha Natesh: నభా నటేష్ .. పేరుకు  కన్నడ భామ అయినా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య వరుస సినిమాలతో సినిమాలు చేసినా.. మధ్యలో చిన్న యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఈమె ‘డార్లింగ్’ మూవీలో మల్టీపుల్ డిజార్డర్ తో భాదపడే స్ల్పిట్ పర్సనాలిటీతో బాధపడే ఆనంది అనే అమ్మాయి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.

"డార్లింగ్" సినిమాలో నభా నటేష్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నభా డైలాగ్ తో రీల్స్ చేస్తున్నారు.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chinnu__🦋❤️ (@premalatha_chinnu)

కెరీర్ లో చిన్న గ్యాప్ తో కాస్త గ్యాప్ వచ్చినా.. ఇపుడు మాత్రం వరుస సినిమాలతో చెలరేగిపోవడానికి సై అంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తూన్న ‘స్వయంభూ’ మూవీ ఉంది. ఇందులో తన కెరీర్ లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను భారీ ఎత్తున ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుత్తోంది. నభా నటేష్ పర్సనల్ విషయానకొస్తే.. 11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది.తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. త్వరలో చేయబోయే సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్. తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది. బడా హీరోల సరసన నభాకు ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

  

Trending News