Naagin 6 Mahekk Chahal : హాస్పిటల్ బెడ్డు మీద సీరియల్ నటి.. నాగిని భామ పరిస్థితి ఎలా ఉందంటే?

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 01:17 PM IST
  • అనారోగ్యానికి గురైన బుల్లితెర నటి
  • హాస్పిటల్‌లో నాగిని భామ మెహెక్ చాహల్
  • న్యూమెనియాతో బాధపడ్డ మెహక్
Naagin 6 Mahekk Chahal : హాస్పిటల్ బెడ్డు మీద సీరియల్ నటి.. నాగిని భామ పరిస్థితి ఎలా ఉందంటే?

Mahekk Chahal Hospitalised బుల్లితెర నటి మెహెక్ చాహల్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుండగా.. మెహక్ చాహల్ అసలు విషయాన్ని చెప్పింది. నాగిని ఆరో సీజన్‌తో మెహక్ ఫేమస్ అయింది. ఆ సీరియల్‌తో వచ్చిన క్రేజ్ కంటే ఇప్పుడు తన అనారోగ్యంతో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ట్రెండ్ అయింది. తాను ఇప్పుడు క్షేమంగా ఉన్నట్టుగా చాహల్ పేర్కొంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahekk Chahal (@maheckchahal)

 

తన ఆరోగ్యం క్షీణించిందని, వెంటిలేటర్ మీద ఉందని ఇలా నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నేను ఇప్పుడు న్యూమోనియా నుంచి పూర్తిగా కోలుకున్నాను.. మునుపటి కంటే ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను.. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నాను.. మీరు చూపించిన ప్రేమ, ఆదరణలకు థాంక్స్.. మీ ప్రార్థనల వల్లే నేను ఆరోగ్యంగా ఉన్నాను.. మళ్లీ నేను కమ్ బ్యాక్ ఇచ్చేందుకు నాకు కాస్త టైం కావాలి.. మళ్లీ మిమ్మల్ని త్వరలోనే  ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పుకొచ్చింది.

 

నేను కరోనా తరువాత ఆరోగ్యం విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించాను.. పని పని అంటూ విదేశాలు తిరుగుతూనే ఉన్నాను.. హెల్త్ గురించి అంతగా పట్టించుకోలేదు.. మీరు కూడా నాలా ఉండకండి.. ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్యగా ఉంటే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించండి అని చాహల్ సలహాలు ఇచ్చింది. మొత్తానికి చాహల్ ఆరోగ్యం మాత్రం ఇప్పుడు నిలకడగానే ఉందని తెలియడంతో అభిమానులు కాస్త ఉపశమనం తీసుకున్నారు.

Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్

Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News