Manjummel boys: డబ్బింగ్ సినిమాల మీద ఎక్కువ మక్కువ.. ట్రెండ్ మార్చిన ప్రొడక్షన్ హౌస్

Mythri Movie Makers : ఒకవైపు పెద్ద హీరో లతో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ బిజీ గా ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్. కానీ ఈ మధ్య మాత్రం పరభాష లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం పై బాగా దృష్టి పెడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది అని ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చ కూడా నడుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2024, 11:07 AM IST
Manjummel boys: డబ్బింగ్ సినిమాల మీద ఎక్కువ మక్కువ.. ట్రెండ్ మార్చిన ప్రొడక్షన్ హౌస్

Manjummel boys : ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ పేరు ముందే ఉంటుంది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో నిర్మిస్తూనే మరోవైపు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు మైత్రి మూవీ మేకర్స్. అయితే గత కొంతకాలంగా వీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప : ది రూల్ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు మరోవైపు వారాంతం రాగానే ఏదో ఒక డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

ఈ మధ్యనే మార్చి 28న మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) అనే సినిమా ను తెలుగులో డబ్ చేసి విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్. అంతేకాకుండా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యి రెండు వందల కోట్ల దాకా వసూళ్లను చేసిన మంజుమల్ బాయ్స్ అనే సినిమాని కూడా ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేయబోతున్నారు. 

మలయాళం సినిమాలు మాత్రమే కాక తమిళ్ లో కూడా విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు సినిమాని తెలుగులో డబ్ చేసి ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. దీంతో సడన్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు డబ్బింగ్ సినిమాలపై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని ఎవరికి అర్థం కావడం లేదు.

ఒకవైపు సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూనే మరోవైపు పర భాషా సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి మరి విడుదల చేస్తున్నారు మైత్రి వారు. వరుసగా ప్రతివారం సినిమాలు విడుదల చేస్తూ నైజాం ఏరియాలో తమ సత్తా చాటాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం థియేటర్లను ఖాళీగా వదిలేయకుండా సీజన్ తో పని లేకుండా ప్రతి వారం ఏదో ఒక మంచి సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వస్తున్నారు అని కొందరు ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా పెద్ద సినిమాల విడుదలలు లేనప్పుడు ఇలాంటి చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతికిస్తాయి. ఈ విషయంలో ముందు అడుగులు వేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ని అభినందించాలి అని అభిమానులు అంటున్నారు.

Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌

Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News