Mrunal Thakur: స్టార్ హీరోని చెంపమీద కొట్టిన మృణాల్ ఠాకూర్.. ఆదే కారణం!

Mrunal Thakur Slaps Star Hero: హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగు కన్నా ముందే హిందీ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు జెర్సీ సినిమా హిందీ రీమేక్ ఆమెకు మంచి విజయం తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమాలో భాగంగా మృణాల్ తనకు ఎంతో ఇష్టమైన హీరోని కొట్టాల్సి వచ్చిందట…

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 26, 2024, 12:53 PM IST
Mrunal Thakur: స్టార్ హీరోని చెంపమీద కొట్టిన మృణాల్ ఠాకూర్.. ఆదే కారణం!

Mrunal Thakur: చిన్నప్పటినుంచి సినిమాల్లో ఎదగాలి అని కలలు కన్న ప్రతి యాక్టర్ కి కూడా ఫేవరెట్ ఆర్టిస్టులు ఉండే ఉంటారు. వారి కల నిజమై యాక్టర్ గా మారి స్టార్ స్టేటస్ సంపాదించినప్పటికీ.. వారి ఫేవరెట్ నటినటులపై వారి అభిమానం మాత్రం అలానే ఉండిపోతుంది. ముఖ్యంగా తమ ఫేవరెట్ యాక్టర్ తో పని చేసే అదృష్టం వస్తే ఎవరికైనా ఎగిరి గంతెయ్యాలి అనిపిస్తుంది. 

కానీ అదే సినిమాలో ఆ ఫేవరెట్ యాక్టర్ ని కొట్టాల్సి వస్తే? ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి ఇదే పరిస్థితి ఏర్పడింది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్, కొద్దిరోజుల క్రితమే జెర్సీ హిందీ రీమేక్ లో నటించింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరో గా నటించారు. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టింది ఈ హీరోయిన్.

తెలుగులో నాని, శ్రద్ధ శ్రీనాథ్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోని గట్టిగా చంప దెబ్బ కొడుతుంది. సినిమా చూసిన అందరికీ ఆ సీన్ గుర్తుండే ఉంటుంది. ఇక ఇదే సన్నివేశం హిందీలో కూడా ఉంది. కానీ సినిమా షూటింగ్ సమయంలో తన ఫేవరెట్ నటుడు షాహిద్ కపూర్ ని చంప మీద కొట్టడం చాలా కష్టమైంది అని చెబుతోంది మృణాల్. 

"నేను షాహిద్ కపూర్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో కలిసి నటించే ఆఫర్ అనగానే వెంటనే ఓకే చెప్పేసాను. షూటింగ్ ఫస్ట్ డే అయినను అలా చూస్తూ ఉండిపోయాను. తెర పై ఆయన నవ్వు ఎంత బావుంటుందో.. నిజంగా కూడా అంతే బాగుంటుందని ఆయనతో చెప్పాను. వారం రోజుల్లోనే మాకు మంచి స్నేహం కుదిరింది. కానీ ఒక సన్నివేశంలో నేను షాహిద్ ని కొట్టాలి అనగానే నాకు భయం వేసింది. నేను స్లోగా కొడతాను.. ఎడిటింగ్ లో చూసుకోండి..అని చెప్పాను. కానీ డైరెక్టర్ మాత్రం నిజంగానే గట్టిగా కొట్టాలి.. అని చెప్పారు. మీ మాజీ బాయ్ ఫ్రెండ్ ని గుర్తు చేసుకొని కొట్టేసేయ్.. అంటూ షాహిద్ కపూర్ జోక్ చేశారు. ఆ సీన్ పూర్తి చేయడానికి నాకు మూడు గంటలు పట్టింది." అని మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల పరంగా చూస్తే మృణాల్ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా ది ఫ్యామిలి స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Also Read: Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు

Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News