Mrunal Thakur Diet Plan: తెలుగు ఆడియన్స్ ను తన అందచందాలతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం సీతారామం.. ఈ సినిమాలో కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.. ఆ తర్వాత పలు చిత్రాలలో అవకాశాన్ని దక్కించుకొని పర్వాలేదు అనిపించుకుంది.. అయితే సీతారామం సినిమాతో ఈమెకు అందిన క్రేజ్ మరే సినిమాకు అందలేదని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాతోనే తెలుగు స్టార్ హీరోలు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఇప్పుడు హీరోయిన్ గా చలామణి అవుతోంది.. మరి ఇంత అందంగా అందరినీ ఆకట్టుకోవడానికి గల కారణం ఆమె డైట్ సీక్రెట్ అని సమాచారం.
మృనాల్ ఠాకూర్ డైట్ సీక్రెట్..
మృనాల్ ఠాకూర్ డైట్ సీక్రెట్ తెలిస్తే మాత్రం కచ్చితంగా పాటించక మానరు.. మరి మృనాల్ ఇంత అందంగా.. యంగ్ గా.. ఫిట్ గా ఉండడానికి ఎటువంటి పనులు చేస్తుంది..? అసలు ఆమె డైట్ సీక్రెట్ ఏంటి ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. తాజాగా మృనాల్ ఠాకూర్ అందంగా.. ఫిట్ గా ఉండడానికి ఒక స్మూతీ తాగుతుందట.. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావలసిన పదార్థాలు ఏంటి..? ఇలా అన్ని విషయాలను ఆమె చెప్పుకొచ్చింది...
హెల్దీ డ్రింక్ కు కావలసిన పదార్థాలు..తయారీ విధానం..
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని.. అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఓట్స్, ఒక కప్పు పాలు లేదా పెరుగు, కొన్ని బ్లూబెర్రీస్, స్ట్రాబెరీ, కొన్ని బాదం పప్పులు, ఒక రెండు ఖర్జూరాలు. ఇక వీటన్నింటిని వేడి మెత్తటి పేస్టులాగా గ్రైండ్ చేసుకుంటే హెల్దీ స్మూతీ రెడీ.. ఇక ప్రతిరోజు మృనాల్ ఠాకూర్ ఈ స్మూతీ తాగుతానని చెప్పుకొచ్చింది. కావాలంటే కొన్ని సబ్జా గింజలు కూడా పైన వేసుకోవచ్చు అని ఈమె తెలిపింది. మొత్తానికి అయితే హెల్తీ స్మూతీని తయారు చేసి తన డైట్ సీక్రెట్ చెప్పేసింది మృనాల్ ఠాకూర్.. అమ్మాయిలు మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మృనాల్ ఠాగూర్ లాగా అందంగా యంగ్ గా కనిపించాలి అంటే ఈమె చెప్పిన ఈ హెల్తీ స్మూతీ ఒకసారి ట్రై చేయండి.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook