సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మెగాస్టార్ చిరంజీవి మద్ధతు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తీసుకోబోతున్నాడట.

Last Updated : Jan 27, 2018, 07:58 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మెగాస్టార్ చిరంజీవి మద్ధతు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తీసుకోబోతున్నాడట. సూపర్ స్టార్ రజినీ రేపోమాపో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఆయనకి చిరంజీవి అందించే సహాయం రాజకీయపరమైనదే అయ్యుంటుందా అని అనుకుంటున్నారేమో!! అబ్బే అలాంటిదేం లేదు లెండి!! ఎందుకంటే, రాజకీయంగా ఎవరి పరిస్థితులు వాళ్లవి వేరు కావడమే కాకుండా ఇద్దరి రాష్ట్రాలు కూడా వేరే కదా!! అయితే, రజినీకి చిరు అందించే సహాయం ఏంటంటే.. సూపర్ స్టార్ అప్‌కమింగ్ సినిమా 2.0 విడుదలకు తెలుగులో కావాల్సిన ప్రమోషన్స్ కోసం శంకర్ అండ్ టీమ్ మెగాస్టార్ సహాయం తీసుకోనుందని తెలుస్తోంది. 

అవును, ప్రస్తుతం సూపర్ స్టార్ కాలా సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా వుండగా.. 2.0 సినిమా దర్శకుడు శంకర్ మాత్రం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై వున్నాడు. వీలైనంత త్వరలోనే 2.0 సినిమా టీజర్ ఆడియెన్స్ ముందుకు రానుంది. తమిళనాట సూపర్ స్టార్ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రజినీనే కింగ్ కనుక. అయితే, ఎటొచ్చీ టాలీవుడ్‌లోనే తమ సినిమాకు తగిన స్థాయిలో ప్రమోషన్ కావాలి అంటే అందుకు చిరు లాంటి స్టార్స్ సహాయం తీసుకోవాలని సూపర్ స్టార్ అండ్ టీమ్ భావిస్తోందట. 

ఈ నేపథ్యంలో త్వరలోనే చిరు చేతుల మీదుగా 2.0 సినిమా తెలుగు టీజర్ లాంచ్ చేయించి ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ఆ సినిమా యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ టీజర్‌ని లాంచ్ చేయడమే సూపర్ స్టార్‌కి చిరు చేసే సహాయం అవుతుందని 2.0 సినిమా యూనిట్ భావిస్తోంది.

Trending News