Megastar Chiranjeevi's Bad Luck Continues With Ponniyan Selvan 1: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమై సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకున్నారు ఆయన. తన కుమారుడు రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించగా ఆయన సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటించిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ ఫలితాన్ని మిగిల్చింది.
అయితే మెగాస్టార్ చిరంజీవి జడ్జిమెంట్ ఇప్పుడు మరో మారు హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేస్తున్న సినిమాలు ఆయన ప్రమోట్ చేస్తున్న సినిమాల ఫలితాలు అన్నీ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఏ సినిమా, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ఏ సినిమా కూడా సరైన ఆదరణ దక్కించుకోలేకపోయింది.
చిన్న సినిమాలను ప్రమోట్ చేసే ఉద్దేశంతో వారు పిలిచిన వెంటనే కాదనకుండా మెగాస్టార్ చిరంజీవి ఆయా సినిమా ఫంక్షన్లకు వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్నా కానీ ఆయన దురదృష్టమో, లేక కాకతాళీయమో తెలియదు కానీ దాదాపు మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాలు అందుకుంటున్నాయి. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన లాల్ సింగ్ చద్దా, మిషన్ ఇంపాజిబుల్, పక్కా కమర్షియల్, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయి.
ఇక ఆయన వాయిస్ ఓవర్ అందించిన సన్ ఆఫ్ ఇండియా, బ్రహ్మాస్త్ర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ఇప్పుడు ఆయన పొన్నియన్ సెల్వన్ సినిమాకు కూడా వాయిస్ ఓవర్ అందించారు. మణిరత్నం డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆ సినిమా మీద మిశ్రమంగా స్పందిస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవడం కష్టమే అంటున్నారు. ఈ దెబ్బతో చిరంజీవి ఖాతాలో మరో ఫ్లాప్ పడింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
Also Read: Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.