Mani Ratnam: మణిరత్నంకు కరోనా పాజిటివ్.. ఆ ఈవెంటే అంటించిందా?

Mani Ratnam hospitalized with Corona: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం. ఆయనకు కరోనా సోకిన నేపద్యంలో చెన్నైలోని అపోలో హాస్పిటల్ ఆయనను జాయిన్ చేసినట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 02:05 PM IST
  • మణిరత్నంకు కరోనా పాజిటివ్
  • హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు
  • అపోలో హాస్పిటల్ లో చేరిక
Mani Ratnam: మణిరత్నంకు కరోనా పాజిటివ్.. ఆ ఈవెంటే అంటించిందా?

Mani Ratnam hospitalized with Corona: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే ఈ కరోనా కేసులు సినీ సెలబ్రిటీలు కూడా హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే మొదటి రెండు మూడు కరోనా వేవ్ ల సమయంలో అనేక మంది సినీనటులు కరోనా బారిన పడి మళ్ళీ కోలుకున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు అనారోగ్య రీత్యా కోలుకోలేక కన్నుమూశారు కూడా. ఇక ఇప్పుడు కొత్తగా మళ్లీ కరోనా కేసులు మొదలయ్యాయి. తాజాగా తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడినట్లు వెల్లడించింది. ఇప్పుడు ఆమె తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం.

ఆయనకు కరోనా సోకిన నేపద్యంలో చెన్నైలోని అపోలో హాస్పిటల్ ఆయనను జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన భార్య సుహాసిని కూడా ఉన్నారని అంటున్నారు. నిజానికి ఆయన పొన్నియన్ సెల్వన్ అనే తమిళ నవల ఆధారంగా ఒక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ రూపొందించారు. విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది.

ఈ మొదటి భాగం సెప్టెంబర్ 30వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం చెన్నైలో ఒక గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో కోవిడ్ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. అక్కడే మణిరత్నంకు కరోనా సోకి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే సాధారణంగా కరోనా లక్షణాలు వచ్చిన వారందరూ ఇప్పుడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

కానీ మణిరత్నం కరోనా బారిన పడి హాస్పిటల్ కి వెళ్లడంతో ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఆయన భార్య సుహాసిని కానీ లేదా ఆయన జాయిన్ అయిన చెన్నై అపోలో హాస్పిటల్ యాజమాన్యం అయినా ఒక అధికారిక ప్రకటన చేస్తే కానీ అసలైన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి చూడాలి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.

Also Read: Acharya: ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు... మరో ఘోర పరాభవం?

Also Read:  Srinu Vaitla: ఆ హీరోయిన్ వల్లే విడాకుల దాకా శ్రీను వైట్ల వ్యవహారం?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News