Manchu Vishnu adopted 120 orphans house from tirupati: ప్రస్తుతం దేశ మంతట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఒక్కరు కూడా తమ సొంతూర్లకు వెళ్లిపోయి.. తమ ఇళ్లలో, బంధువులు, స్నేహితులతో సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే.. మంచు మోహన్ బాబు సైతం.. తన ఫ్యామిలీతో కలిసి తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సీటీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. మంచు విష్ణు తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మంచు విష్ణు తాజాగా.. తిరుపతిలోని బైరాగి పట్టేడ ప్రాంతానికి చెందిన మాతృశ్య అనాథశ్రమంలోని 120 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు . ఇక మీదట వారి చదువులు, వైద్యం అంతా తనదే బాధ్యతని మంచు విష్ణు ప్రకటించారు. అంతే కాకుండా.. వారిని ఒక కుటుంబ సభ్యునిగా చూసుకుంటానని కూడా మంచు విష్ణు వెల్లడించారు.
ఈ క్రమంలో మంచు విష్ణు ఏకంగా 120 మంది అనాథలను దత్తత తీసుకొవడం పట్ల నెటిజన్లు మంచు ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సీటీలో సంక్రాంతి వేడుకల్ని మోహన్ బాబు కుటుంబం జరుపుకున్నారు. అయితే..ఈ వేడుకలకు మాత్రం మంచు మనోజ్ దూరంగా ఉన్నారు. ఆయన తన భార్య, పిల్లలతో కలిసి జల్ పల్లిలోని తననివాసం దగ్గర భోగీ వేడుకల్ని జరుపుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల మోహన్ బాబు వర్సెస్ మనోజ్ వివాదం, ఆ తర్వాత మంచు విష్ణు సెక్యురిటీ సిబ్బంది అడవి పందుల్ని వేటాడం, కన్నప్ప మూవీలో పార్వతీ దేవీ పోస్టర్ అంశాలు రచ్చగా మారాయి. ఈక్రమంలో మంచు విష్ణు తాజాగా.. తీసుకున్న నిర్ణయం మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter