Manchu Manoj Tweet on Community మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. నాగబాబు గురించి పరోక్షంగా మంచు మనోజ్ హయ్యర్ పర్పస్ అంటూ కామెంట్ చేయనంత వరకు మంచు మనోజ్ మీద ట్రోలింగ్ జరిగేది కాదు. కానీ మంచు మనోజ్ సైతం అలా మాటలు జారడంతో.. ఆయన్ను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు నెటిజన్లు. దీంతో మంచు వారిని మొత్తంగా సోషల్ మీడియా ట్రోల్ చేయడం ప్రారంభించింది.
ఇక తాజాగా మంచు మనోజ్ కులమత ప్రస్థావన తీసుకొచ్చారు. మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వారు? అంటూ ఓ ప్రశ్నను లేవనెత్తాడు. బయటకు కనిపించే తీరుతో మనకు ఓ రకమైన గుర్తింపు, గౌరవం వస్తుంది.. డబ్బు, పవర్, అంతస్థులు చూసి మనకు గౌరవం ఇస్తుంటారు. ఇంకొందరు మన మంచి తనాన్ని చూసి గౌరవిస్తుంటారు. మంచి, మానవత్వం వంటి వాటితో గుర్తిస్తుంటారు. ఇందులో మీరు ఏ వర్గానికి చెందిన వారు అవుతారు? అంటూ మంచు మనోజ్ అడిగేశాడు.
Which community do you belong to ?! pic.twitter.com/oCfzEG9zdQ
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 4, 2023
దీంతో నెటిజన్లు మంచు మనోజ్‌ను ఆడేసుకుంటున్నారు. కులాల గురించి మీరే మాట్లాడాలి.. హయ్యర్ పర్పస్ గురించి చెప్పిన నువ్వే ఇవన్నీ మాట్లాడుతున్నావా? అంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అసలే ఇప్పుడు కులాల చర్చలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చర్చల్లోకి వస్తోన్న సంగతి తెలిసిందే.
మంచు మనోజ్ చాలా ఏళ్ల తరువాత తన కొత్త సినిమాను ప్రకటించాడు. వాట్ ది ఫిష్ అంటూ మంచు మనోజ్ సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక మంచు మనోజ్ తన రెండో పెళ్లి గురించి ఎప్పుడు ప్రకటిస్తాడా? అని అంతా ఎదురుచూస్తున్నారు. భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ డేటింగ్లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే.
Also Read: Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?
Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి