Mallareddy Pawan Kalyan Offer: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. జస్ట్ లో మిస్ అయిందట..?

Mallareddy Rejected Harish Shankar Movie Offer: తనను పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశా అటూ మంత్రి మల్లా రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 28, 2023, 11:44 AM IST
Mallareddy Pawan Kalyan Offer: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. జస్ట్ లో మిస్ అయిందట..?

MallaReddy Rejected Pawan Kalyan Movie Offer: తెలంగాణలో ట్రెండింగ్ లో ఎప్పటికప్పుడు నిలుస్తూ ఉండే పొలిటిషన్ ఎవరు అంటే అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం మల్లారెడ్డి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తర్వాత రాజకీయ పరిణామాలు నేపద్యంలో టీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక సాధారణంగా ఆయన చెప్పే డైలాగ్ లు, ఆయన మాట్లాడే మాటలు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఆయన మేం ఫేమస్ అనే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ వేసుకునే అమ్మాయిలతో తిరిగితే యూత్ ఫేమస్ అవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. కష్టపడితేనే యువత ఫేమస్ అవుతారని తాను పాలమ్మి కష్టపడి కేసీఆర్ దయతో మంత్రి అయ్యానని మల్లన్న చెప్పుకొచ్చారు. ప్రపంచంలో నెంబర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని కేటీఆర్ కృషి వల్లే హైదరాబాదులో గూగుల్, అమెజాన్ సంస్థలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు. అదేమిటంటే ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ తన ఇంటికి వచ్చారని గంటసేపు కూర్చుని పవన్ కళ్యాణ్ సినిమాలో తనను విలన్ గా నటించమని బతిమలాడారని అన్నారు. మల్లన్న ప్రస్తుతం నీదే ప్రభంజనం నడుస్తోంది, రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మల్లారెడ్డి పేరే వినిపిస్తోంది, మా పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని ఆయన అడిగినా నేను ససేమిరా నటించను అని చెప్పినట్టుగా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతోంది.

గతంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను వీరు అనౌన్స్ చేశారు. కానీ అది పట్టాలెక్కలేదు. చివరికి ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే మంత్రి మల్లారెడ్డి సరదాగా ఈ కామెంట్లు చేశారా? లేక నిజంగానే హరీష్ శంకర్ మల్లారెడ్డి నివాసానికి వెళ్లి పవన్ సినిమాలో నటించమని కోరారా? అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఈరోజు జరిగిన ఒక బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read; Manchu Manoj: దగ్గరుండి మంచి విష్ణు పెళ్లి చేసిన మనోజ్ కు ఎక్కడ చెడింది?

Also Read: Jr NTR Lovely Wishes: లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. 'అమ్మలూ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook 

 

Trending News